Dragon Fruit: పండు పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం… చైనా పేరు ముడిపడి ఉండడమే కారణం..

డ్రాగన్‌ ఫ్రూట్‌గా పిలిచే ఈ పండు పేరు మార్చాలని తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ను కమలంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. ఇంతకీ పేరు ఎందుకు మార్చారనేగా..

Dragon Fruit: పండు పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం... చైనా పేరు ముడిపడి ఉండడమే కారణం..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 1:03 PM

Dragon Fruit Name Changed: డ్రాగన్‌ ఫ్రూట్‌.. గత కొన్ని రోజుల వరకు ఈ పండు పేరు అందరికీ తెలియకపోయినప్పటికీ మాల్ కల్చర్‌ ఎక్కువైన తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పుడీ పండు లభిస్తోంది. మధ్య అమెరికాకు చెందిన ఈ పండును ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో సాగు చేస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌గా పిలిచే ఈ పండు పేరు మార్చాలని తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ను కమలంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. ఇంతకీ పేరు ఎందుకు మార్చారనేగా మీ సందేహం.. డ్రాగన్‌ ఫ్రూట్‌ పేరు చైనాతో ముడి పడి ఉండడం వల్లే పేరు మార్చినట్లు సీఎం పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్రంలో ఉద్యానవన అభివృద్ధి మిషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ను కమలం పండ్లుగా పిలిచేందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పండు పేరు మార్పు విషయంలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఇదిలా ఉంటే.. కమలం బీజేపీ ఎన్నికల గుర్తు కావడం.. గాంధీనగర్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం పేరు కూడా ‘శ్రీకమలం’ కావడం గమనార్హం.

Also Read: Odisha Miniature Artist: నూతన అమెరికా అధ్యక్షుడిపై ఒడిశా చిత్రకారుడి అభిమానం, సీసాలో జో చిత్రం