పాక్ కోర్టు సంచలన తీర్పు.. చచ్చినా శవాన్ని ఈడ్చుకొచ్చి.. మూడురోజుల పాటు..

పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చచ్చిన శవాన్నైనా సరే.. మూడు రోజులపాటు ఉరితీయండంటూ.. ఆదేశించింది. రాజద్రోహం కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పునకు సంబంధించి పూర్తివివరాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మరణశిక్ష అమలయ్యేలోపే.. ఏదేని కారణంతో ముషారఫ్‌ మరణిస్తే.. ఆయన శవాన్ని పార్లమెంట్ ముందుకు ఈడ్చుకురావాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు.. ఆ తర్వాత ఆ […]

పాక్ కోర్టు సంచలన తీర్పు.. చచ్చినా శవాన్ని ఈడ్చుకొచ్చి.. మూడురోజుల పాటు..
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2019 | 6:17 AM

పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చచ్చిన శవాన్నైనా సరే.. మూడు రోజులపాటు ఉరితీయండంటూ.. ఆదేశించింది. రాజద్రోహం కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పునకు సంబంధించి పూర్తివివరాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మరణశిక్ష అమలయ్యేలోపే.. ఏదేని కారణంతో ముషారఫ్‌ మరణిస్తే.. ఆయన శవాన్ని పార్లమెంట్ ముందుకు ఈడ్చుకురావాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు.. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మూడు రోజులపాటు పార్లమెంట్ బయట ఉరితీసి.. వేలాడదీయాలని స్పష్టంచేసింది.

పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముషారఫ్‌పై మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పునకు సంబంధించి 169 పేజీల పూర్తివివరాలను ఇవాళ విడుదల చేసింది.

కాగా, 2007 నవంబరు 3న దేశ రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించి.. దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై.. కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 6 ప్రకారం.. ఇలా దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసినా, సస్పెండ్‌ చేసినా.. అది దేశద్రోహం కిందకే వస్తుంది. 2013లో నవాజ్‌ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్‌(ఎన్‌) ప్రభుత్వం.. ముషారఫ్‌పై ఈ రాజద్రోహం కేసు నమోదు చేసింది.