ఇక రక్షణ సాధనాల ఉత్పత్తిలో స్వావలంబన

రక్షణ రంగంలో 'ఆత్మ నిర్భర్' నినాదం 'మారు మోగనుంది'. రక్షణ సాధనాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక రక్షణ సాధనాల ఉత్పత్తిలో స్వావలంబన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 04, 2020 | 12:24 PM

రక్షణ రంగంలో ‘ఆత్మ నిర్భర్’ నినాదం ‘మారు మోగనుంది’. రక్షణ సాధనాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో మన దేశమే ఇతర దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రక్షణ మంత్రిత్వ శాఖ… ముసాయిదా పాలసీనొకదానిని రూపొందించి విడుదల చేసింది. డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ పాలసీగా దీన్ని వ్యవహరిస్తున్నారు. 2025 కల్లా రూ.1,75,000 కోట్ల టర్నోవర్ సాధించాలన్నది ఈ పాలసీ లక్ష్యం. ఇందులో ఏరో స్పేస్, డిఫెన్స్ గూడ్స్ ఎగుమతుల ద్వారా 35 వేల కోట్ల టర్నోవర్ సాధించాలన్న ఉద్దేశం కూడా ఉంది.

రక్షణ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను,  స్టార్టప్ లను మరింతగా ప్రోత్సహించాలి..వనరుల కేటాయింపును  సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవాలి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఎఫ్ డీ ఐ, ఇన్వెస్ట్ మెంట్స్  తదితరాల గురించి ఈ విధానంలో ప్రస్తావించారు.

గతంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కొత్త ముసాయిదా పాలసీని రూపొందించింది.