ఇక ఫోన్ పోయినా..డోంట్ వర్రీ! ఎక్కడున్నా కనిపెట్టే టెక్నాలజీ వచ్చేస్తుంది

మీ మొబైల్ ఫోన్ ఎక్కడన్నా పోయినా.. ఎవరయినా దొంగతనం చేసినా ఇకపై కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే మీరు పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టే టెక్నాలజీ ఆగస్టు నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను ఇప్పటికే డెవలప్ చేశారు. కేంద్రం ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడమే తరువాయి. మొబైల్‌ ఫోన్‌ చోరీ చేసిన వారు అందులోంచి సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నెంబరును మార్చేసినా అది ఎక్కడుందో కనిపెట్టేయొచ్చని‌ సంబంధిత అధికారులు తెలిపారు. ‘‘సెంట్రల్‌ ఫర్‌ […]

ఇక ఫోన్ పోయినా..డోంట్ వర్రీ! ఎక్కడున్నా కనిపెట్టే టెక్నాలజీ వచ్చేస్తుంది
Follow us

|

Updated on: Jul 07, 2019 | 9:35 PM

మీ మొబైల్ ఫోన్ ఎక్కడన్నా పోయినా.. ఎవరయినా దొంగతనం చేసినా ఇకపై కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే మీరు పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టే టెక్నాలజీ ఆగస్టు నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను ఇప్పటికే డెవలప్ చేశారు. కేంద్రం ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడమే తరువాయి.

మొబైల్‌ ఫోన్‌ చోరీ చేసిన వారు అందులోంచి సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నెంబరును మార్చేసినా అది ఎక్కడుందో కనిపెట్టేయొచ్చని‌ సంబంధిత అధికారులు తెలిపారు. ‘‘సెంట్రల్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమేటిక్స్‌ (సీ-డాట్‌) వద్ద ఈ టక్నాలజీ సిద్ధంగా ఉంది. పార్లమెంటు సమావేశాల అనంతరం  టెలికాం శాఖ త్వరలోనే సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి, దీన్ని ప్రారంభించాలని కోరనుంది.