అల్కహాల్ ఉన్న శానిటైజర్లు వాడొద్దు- షహబుద్దీన్

మసీదులను పరిశుభ్రం చేసేందుకు అల్కహాలున్న శానిటైజర్లు వినియోగించవద్దని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మౌలానా షహబుద్దీన్ సూచించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పవిత్రమైన మసీదులను శుభ్రం చేసేందుకు ఆల్కహాలు ఉన్న శానిటైజర్లు వాడవద్దని సలహా ఇచ్చారు....

అల్కహాల్ ఉన్న శానిటైజర్లు వాడొద్దు- షహబుద్దీన్
Follow us

|

Updated on: Jun 12, 2020 | 10:50 AM

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 1.0లో భాగంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నాయి. సామాజిక దూరంను పాటించటంతోపాటు శానిటైజేషన్ తప్పనిసరిగా వినియోగించాలని వెల్లడించింది. అయితే తాజాగా ఆల్ ఇండియా తంజీమ్ ఉలేమా ఈ ఇస్లాం పక్షాన మసీదుల నిర్వాహకులకు సూచనలు పంపించింది. మసీదులను పరిశుభ్రం చేసేందుకు అల్కహాలున్న శానిటైజర్లు వినియోగించవద్దని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మౌలానా షహబుద్దీన్ సూచించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పవిత్రమైన మసీదులను శుభ్రం చేసేందుకు ఆల్కహాలు ఉన్న శానిటైజర్లు వాడవద్దని సలహా ఇచ్చారు. కరోనా ప్రబలకుండా మసీదులను శానిటైజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాము అల్కహాలున్న శానిటైజర్లు వాడకుండా డిటర్జెంట్ పౌడర్‌తో మసీదులను శుభ్రం చేయాలని మౌలానా షహబుద్దీన్ సూచించారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులు కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించడంతోపాటు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని షహబుద్దీన్ కోరారు.