రాజకీయాలు మాట్లాడొద్దంటూ టీకొట్టులో బోర్డు

కర్ణాటక రాష్ట్రంలోని మండ్య ప్రాంతంలో ఒక టీ కొట్టు యజమాని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కొట్టు ముందు అతను పెట్టిన బోర్డు వైరల్‌గా మారింది. ‘దయచేసి రాజకీయ విషయాలు మాట్లాడవద్దు. కాఫీ, టీ తాగి క్షేమంగా వెళ్లి రండి’ అంటూ అతను బోర్డు మీద రాసి ఉంచాడు. సహజంగా టీ తాగడానికి వెళ్లినప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకోవడం చాలామందికి అలవాటు. అందులో ఎక్కువగా రాజకీయాలుగా మాట్లాడుకుంటారు. ఎన్నికలవేళ కావడంతో ఆ రాజకీయ చర్చలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. హోటల్‌కు […]

రాజకీయాలు మాట్లాడొద్దంటూ టీకొట్టులో బోర్డు
Follow us

|

Updated on: Mar 20, 2019 | 9:38 AM

కర్ణాటక రాష్ట్రంలోని మండ్య ప్రాంతంలో ఒక టీ కొట్టు యజమాని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కొట్టు ముందు అతను పెట్టిన బోర్డు వైరల్‌గా మారింది. ‘దయచేసి రాజకీయ విషయాలు మాట్లాడవద్దు. కాఫీ, టీ తాగి క్షేమంగా వెళ్లి రండి’ అంటూ అతను బోర్డు మీద రాసి ఉంచాడు. సహజంగా టీ తాగడానికి వెళ్లినప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకోవడం చాలామందికి అలవాటు. అందులో ఎక్కువగా రాజకీయాలుగా మాట్లాడుకుంటారు.

ఎన్నికలవేళ కావడంతో ఆ రాజకీయ చర్చలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. హోటల్‌కు వచ్చేవాళ్లు రాజకీయాలు మాట్లాడుకుంటే గొడవలు జరిగే అవకాశం ఉందని, అందుకే దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నానని హోటల్ యజమాని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆ టీకొచ్చేవారు కూడా స్వాగతిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ రాజకీయాలను మాట్లాడటం లేదు. ప్రస్తుతం తన వ్యాపారం బాగానే ఉందని చెబుతున్న ఆ యజమాని తన దుకాణానికి సినిమా నటుల అభిమానులు ఎక్కువగా వస్తుంటారని చెబుతున్నారు.