పోలవరం పనులు ఆపకండి..సీఎంకు ఉమా విజ్ఞప్తి

Devineni Uma Urges AP CM YS Jagan About Polavaram Project, పోలవరం పనులు ఆపకండి..సీఎంకు ఉమా విజ్ఞప్తి

టీడీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ మీద కోపంతో పోలవరం పనులు ఆపొద్దని కోరారు. పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే జగన్ ఎక్కువసేపు గడిపారంటూ విమర్శలు చేశారు. కర్నూలు జలదీక్షలో ప్రస్తుత సీఎం మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారని… పోలవరంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు కొట్టిపారేశారు. ఆ నాడు ప్రతిపక్షoలో ఉన్న జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడారో..ఓ సారి నెమరువేసుకుంటే మంచిదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని.. అందరి నిర్ణయాలు తీసుకుని కాఫర్ డ్యామ్ పనులు మొదలెట్టామని స్ఫష్టం చేశారు. అప్పర్ డ్యామ్, లోయర్ డ్యామ్ పనులు అన్ని కూడా 60 శాతం పైగానే పూర్తి అయ్యాయిని తెలిపారు. అప్పటి ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలపబట్టి పోలవరం కల సాకారం అయిందన్నారు.

16 జాతీయ ప్రాజెక్ట్‌లలో పొలవరాన్ని ఎప్పుడు ఎలా పూర్తి చేయబోతున్నారో అప్పటి కేంద్ర మంత్రి చెప్పటం జరిగిందన్నారు. 16 వేల కోట్ల ప్రాజెక్ట్ 55 వేల కోట్లకు పెంచామని దాని మీద ఆడిట్ చేయడంలో తమకు అభ్యంతరం లేదన్న ఉమ..ఏ లెక్కలు తీసినా టీడీపీకి ఎటువంటి దిగులు లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *