Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • వేర్‌హౌజ్‌లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్. జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వచేయడమే కారణమని లెబనాన్ అధ్యక్షుడు మైఖేల్ ఔన్ ట్వీట్. సమగ్ర దర్యాప్తు చేపట్టిన సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ . బాధ్యులపై తీవ్రమైన చర్యలు, కఠిన శిక్షలు అమలు చేస్తామని వెల్లడి . పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన బీరుట్ పోర్ట్. అత్యవసర నిధి కింద 100 బిలియన్ లీరాలు విడుదల చేసిన లెబనాన్ అధ్యక్షుడు. లెబనాన్‌కి 240 కి.మీ దూరంలోని సైప్రస్ దీవుల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు. పేలుళ్లు 3.4 తీవ్రత కల్గిన భూకంపాన్ని సృష్టించాయని నిపుణుల అంచనా. వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్‌కు నిప్పు తగిలితే అత్యంత తీవ్రతతో పేలుతుంది. పేలుడుతో నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా వంటి విషవాయువులు విడుదల.
  • తిరుపతి...పేరూరు వకుళామాత ఆలయంలో చారిత్రాత్మిక శాసనం లభ్యం. 1101 వ శతాబ్దం కిచేందిన శాసనంగా గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు. విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్టు చెప్తున్న శాసనం. టిటిడి ఇప్పటివరకు వకుళామాత ఆలయానికి సంభందించి ఎప్పుడు దొరకనట్టువంటి చారిత్రక ఆధారాలు.. తొలిసారిగా శాసనం బయటపడినా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్న పురవస్తూశాఖ అధికారులు.
  • పేరూరు వకులమాత ఆలయంలో దొరికిన1101 శతాబ్దపు శాసనాలను పరిరక్షిస్తున్న అధికారులు. బండరాళ్లపై శాసనం ఉండటంతో దాని చుట్టూ కాంక్రీట్ దిమ్మను నిర్మిస్తున్న అధికారులు. వందల ఏళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి దొరికి న శాసనం.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 554.60 అడుగులు. ఇన్ ఫ్లో : 40,150 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 2200 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 215.5430 టీఎంసీలు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ పూణేలో కన్నుమూశారు.
  • చెన్నై విమానాశ్రయం లో భారీ గా పట్టుబడ్డ బంగారం , ఇద్దరు అరెస్ట్ . దుబాయ్ - షార్జా నుండి చెన్నై అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించినచిన కస్టమ్స్ అధికారులు . పట్టుబడ్డ 1 .48 కేజీల బంగారం విలువ 82 లక్షలు . చెన్నై కి చెందిన ఖలీల్ అహమద్ ,కాజా మొయిద్దీన్ అరెస్ట్ విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.

స్టెరిలైట్ పరిశ్రమను తెరవొద్దు: సుప్రీం

, స్టెరిలైట్ పరిశ్రమను తెరవొద్దు: సుప్రీం

దిల్లీ: తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ రాగి పరిశ్రమను తిరిగి తెరిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పరిశ్రమను తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇచ్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ)కు ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో మద్రాసు హైకోర్టుకు వెళ్లేందుకు వేదాంత కంపెనీకి న్యాయస్థానం అనుమతిచ్చింది

స్టెరిలైట్‌ కర్మాగారం తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతోందని, దీన్ని వెంటనే మూసివేయాలని 2018లో తూత్తుకుడితో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా 13 మంది మృతిచెందారు. దీంతో ఈ పరిశ్రమను వెంటనే మూసివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనబెట్టి కర్మాగారాన్ని తిరిగి తెరవాలని గతేడాది డిసెంబరులో కాలుష్య నియంత్రణ మండలిని ఎన్‌జీటీ ఆదేశించింది.

దీంతో ఎన్‌జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఎన్‌జీటీ ఆదేశాలను అమలు చేసేలా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలికి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ వేదాంతా గ్రూప్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి నేడు తీర్పు వెల్లడించింది.స్టెరిలైట్‌ పరిశ్రమను తిరిగి తెరవాలని ఆదేశించేందుకు ఎన్‌జీటీకి ఎలాంటి న్యాయపరమైన అధికారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతానికి ఆ కర్మాగారాన్ని తిరిగి తెరవొద్దని ఆదేశించింది.

Related Tags