Breaking News
  • ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ. పండుగకు ఏ రాష్ట్ర సరిహద్దు వరకు ఆ రాష్ట్ర బస్సులు. ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందించిన టీఎస్‌ ఆర్టీసీ ఎండీ. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేం. రెండు రోజులు ఆలస్యమైనా శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే.. ఏపీకి తెలంగాణ బస్సులు.. తెలంగాణకు ఏపీ బస్సులు నడుస్తాయి. ఈ నెల 27 తర్వాతే రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు. -తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ.
  • కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్ట్‌లే లక్ష్యంగా జగన్‌ పాలన. విద్య కోసం కూడా ఇతరరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమైతే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. తిరుగుబాటు తప్పదు. -టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
  • నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. తర్వాత రిటైరై హైదరాబాద్‌లో ఉంటారు-మంత్రి కొడాలి నాని. ప్రభుత్వానికి రమేష్‌కుమార్‌ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో.. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు-మంత్రి కొడాలి నాని. బీహార్‌ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు-కొడాలి నాని.
  • మహబూబాబాద్‌: దీక్షిత్ కిడ్నాప్‌, హత్య కేసులో తల్లి వసంత అనుమానాలు. దీక్షిత్‌ కేసులో మంద సాగర్‌తో పాటు మరో ముగ్గురి పాత్ర కూడా ఉంది. వారి నుంచి మాకు, మా చిన్న కుమారుడికి కూడా ప్రాణ హాని ఉంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.. లేదా కేసు సీబీఐకి అప్పగించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మరిన్ని నేరాలు పెరుగుతాయి. -దీక్షిత్‌ తల్లి వసంత.
  • అమరావతి: కృష్ణా బోర్డు పరిధిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు. స్పిల్‌వేలు, జలవిద్యుత్ కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి తేవాలి. కాలువహెడ్ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలపథకాలను బోర్డు పరిధిలోకి తేవాలి. నీటి విడుదల, నియంత్రణ అధికారులు.. బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాలని ప్రతిపాదనలు.
  • ట్రాఫిక్‌ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించాం. అడ్డగోలుగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తప్పవు-మంత్రి పేర్ని నాని. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలి-మంత్రి పేర్ని నాని. ఏపీ, తెలంగాణ చెక్‌పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించాం-పేర్ని నాని. మంగళవారం ఒప్పందం చేసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెప్పారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. టీఎస్ అధికారులు ఏది చెబితే దానికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఎస్‌ అధికారులు ప్రతిపాదనలు ఇవ్వలేదు-పేర్ని నాని. మేము మొదటి నుంచి కూడా మొండిగా ప్రవర్తించలేదు. ఆర్టీసీ లాభనష్టాలను చూడడంలేదు.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ఆర్టీసీకి సెలవుల కారణంగా ఒప్పందం చేసుకోలేకపోయాం.
  • గుంటూరు: తాడేపల్లిలోని రెండు ఫార్మసీ షాపుల్లో చోరీ, రూ.18 వేలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన దుండగులు, పీఎస్‌లో ఫిర్యాదు.

హిందుత్వపై మీ సర్టిఫికెట్‌ అవసరం లేదు ః గవర్నర్‌కు థాక్రే కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌ కథే మహారాష్ట్రలోనూ పునరావృతమవుతోంది.. ముఖ్యమంత్రి-గరవ్నర్‌ మధ్య గొడవలు ముదురుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే అయితే గవర్నర్‌ బి.ఎస్‌.కోషియారీపై అంతెత్తున లేచారు..

పశ్చిమ బెంగాల్‌ కథే మహారాష్ట్రలోనూ పునరావృతమవుతోంది.. ముఖ్యమంత్రి-గరవ్నర్‌ మధ్య గొడవలు ముదురుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే అయితే గవర్నర్‌ బి.ఎస్‌.కోషియారీపై అంతెత్తున లేచారు.. గొడవంతా ప్రార్థన స్థలాలను తెరవాలా వద్దా అన్న దానిపై వచ్చింది.. ప్రార్థనాస్థలాలను తెరవాలంటూ గవర్నర్‌ కోషియారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేకు ఓ పెద్ద లేఖ రాశారు.. అందులో తమరు అకస్మాత్తుగా లౌకకవాదిగా ఎలా మారిపోయారు? అంటూ సీఎంను గవర్నర్‌ ప్రశ్నించారు.. హిందుత్వంపై తమరి సర్టిఫికెట్‌ తనకేమీ అవసరం లేదంటూ ఉద్ధవ్‌ ఘాటుగా బదులిచ్చారు.. మహారాష్ట్రలో ప్రార్థన స్థలాలను మళ్లీ తెరవాలంటూ ఓ మూడు బృందాలు తనకు లేఖల రూపంలో విన్నవించుకున్నాయంటూ గవర్నర్‌ లేఖలో ప్రస్తావిస్తే.. అందుకు జవాబుగా … ఆ మూడు బృందాలు యాధృచ్చికంగా బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులేవేనంటూ ఉద్ధవ్‌ వ్యంగ్యంగా అన్నారు. మీరు చెప్పగానే ప్రార్థనాస్థలాలను తెరవలేమని, కరోనా వైరస్‌ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని ఉద్దవ్‌ కుండబద్దలు కొట్టారు. అయినా ప్రార్థనస్థలాలను తెరిస్తే హిందుత్వ వాదులు, తెరవకపోతే లౌకికవాదులు ఎలా అవుతారో గవర్నర్‌గా చెబితే బాగుంటుందన్నారు థాక్రే. తాను ఆచరించే హిందుత్వకు గవర్నర్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తనమీద ఉందని చెప్పారు. మరోవైపు గవర్నర్‌ లేఖపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా మండిపడ్డారు.. హిందుత్వ పునాదుల మీదనే శివసేన నిర్మితమైనదని రౌత్‌ అన్నారు. ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవలసిన ఆవశ్యకత తమకు లేదన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ కూడా గవర్నర్‌ లేఖపై అభ్యంతరం చెప్పారు.. ఆయన వాడిన భాష బాగోలేదన్నారు. అన్ని మతాలను సమదృష్టితో చూడాలని రాజ్యాంగం చెబుతున్నదని, సీఎం హోదాలో ఉన్నవారు అందుకు తగినట్టుగా నడుచుకోవాలని పవార్‌ అన్నారు.. ఓ రాజకీయపార్టీ నేతను ఉద్దేశించి గవర్నర్‌ లేఖ రాసినట్టుగానే ఉంది తప్ప ముఖ్యమంత్రికి రాసినట్టుగా లేదని శరద్‌ పవార్‌ అన్నారు.. గవర్నర్‌ తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కంప్లయింట్‌ కూడా చేశారు..

Related Tags