సంకుచిత రాజకీయాలు మానండి.. సోనియాపై రైల్వే యూనియన్ ఫైర్

వలస కూలీలను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నిర్వహిస్తున్న  శ్రామిక్ రైళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంకుచిత రాజకీయాలు చేస్తున్నారని ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ విమర్శించింది. ఈ వైఖరిని మానుకోవాలని కోరింది. ఈ మేరకు ఈ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఆమెకు ఓ లేఖ రాస్తూ..రైల్వే  స్టేషన్లలో పెద్ద ఎత్తున జనం గుమికూడడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, అందువల్లే తమ శాఖ చార్జీలు వసూలు చేస్తోందన్నారు. […]

సంకుచిత రాజకీయాలు మానండి.. సోనియాపై  రైల్వే యూనియన్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 07, 2020 | 5:25 PM

వలస కూలీలను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నిర్వహిస్తున్న  శ్రామిక్ రైళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంకుచిత రాజకీయాలు చేస్తున్నారని ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ విమర్శించింది. ఈ వైఖరిని మానుకోవాలని కోరింది. ఈ మేరకు ఈ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఆమెకు ఓ లేఖ రాస్తూ..రైల్వే  స్టేషన్లలో పెద్ద ఎత్తున జనం గుమికూడడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, అందువల్లే తమ శాఖ చార్జీలు వసూలు చేస్తోందన్నారు. ఈ కరోనా కాలంలో తమ సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లోనే విధి నిర్వహణ చేస్తున్నారని, వారి మనోధైర్యాన్ని దెబ్బ తీయవద్దని ఆయన ఈ లేఖలో అభ్యర్థించారు. వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా వారివారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖకు అయ్యే మొత్తంలో కేంద్రం 85 శాతాన్ని, రాష్ట్రాలు మిగతా శాతాన్ని భరిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో మొత్తం 115 స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు.

వలస కూలీల తరలింపునకు అయ్యే వ్యయాన్ని తమ రాష్ట్ర పీసీసీలు భరిస్తాయని, వారి నుంచి చార్జీలు వసూలు చేయరాదని సోనియా .. కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.