రాయుడుపై సానుభూతి అనవసరం!

ముంబై: వరల్డ్‌కప్ 2019 నుంచి టీమిండియా నిష్క్రమించడంతో సెలక్షన్ కమిటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ ముందు నుంచి ఇండియా మిడిల్ ఆర్డర్‌ అంత పటిష్టంగా లేదు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయి ఆటగాడిని ఎంపిక చేయడంలో సెలెక్టర్లు పూర్తిగా విఫలమయ్యారు. అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, విజయ్ శంకర్, మనీష్ పాండే వంటి ఆటగాళ్లను టీమ్ ట్రై చేసినా వారు కూడా ఫెయిల్ అయ్యారు. ఇది ఇలా ఉండగా టీమిండియా ప్రపంచకప్‌లో రాయుడికి […]

రాయుడుపై సానుభూతి అనవసరం!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 7:37 PM

ముంబై: వరల్డ్‌కప్ 2019 నుంచి టీమిండియా నిష్క్రమించడంతో సెలక్షన్ కమిటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ ముందు నుంచి ఇండియా మిడిల్ ఆర్డర్‌ అంత పటిష్టంగా లేదు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయి ఆటగాడిని ఎంపిక చేయడంలో సెలెక్టర్లు పూర్తిగా విఫలమయ్యారు. అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, విజయ్ శంకర్, మనీష్ పాండే వంటి ఆటగాళ్లను టీమ్ ట్రై చేసినా వారు కూడా ఫెయిల్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా టీమిండియా ప్రపంచకప్‌లో రాయుడికి బదులుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను నాలుగవ స్థానంలో ట్రై చేసింది. అయితే అనుకోని విధంగా విజయ్ శంకర్‌కు గాయం కావడం.. ఇక ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. కొంతమంది అయితే బీసీసీఐ వల్లే రాయుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నాడని మండిపడ్డారు.

అటు అంబటి రాయుడిని ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని.. ఆ విషయంలో పశ్చాతాపం అవసరం లేదని తాజా ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాల్ పేర్కొన్నారు. 2003లో తాను సెలెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి రాయుడు, కార్తీక్ ఆడుతున్నారన్న ఆయన.. అప్పటి నుంచి వారికి అనేక అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పారు. అయితే తొలి జాబితాలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం కలిగిందన్న ఆయన.. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్స్‌లు ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..