Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

ఆర్మీ జవాన్లకు హానీ ట్రాప్.. ఎందుకంటే.?

Rajasthan Police arrests 2 army jawans in honeytrap case, ఆర్మీ జవాన్లకు హానీ ట్రాప్.. ఎందుకంటే.?

పాకిస్థాన్ రోజురోజుకి మోసపూరితమైన దారులు తొక్కుతూ ఇండియా ఆర్మీను మట్టుబెట్టాలని చూస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ఏ అవకాశం దొరికినా వదలకుండా మన ఆర్మీపై అస్త్రాలు సందిస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో ద్వారా అనేక మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్నే ఆయుధంగా ఉపయోగిస్తూ.. ఆర్మీ రహస్యాలను దొంగిలించడం కోసం.. మన సైనికులకు అమ్మాయిల ముసుగుతో వల విసురుతోంది.

అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి.. జవాన్లను ముగ్గులోకి దింపి కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల వలలో పడని వాళ్ళకు బాబాల ముసుగులో నమ్మించి ట్రాప్ చేస్తున్నారట. ఇక ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోవడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. తమ జవాన్లకు పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న 150 ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌కు దూరంగా ఉండాలంటూ సూచనలు చెప్పింది.

ఇక తాజాగా రాజస్థాన్‌లో పాకిస్థాన్ హానీ ట్రాప్ వలలో చిక్కుకున్న ఇద్దరు ఆర్మీ జవాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐకి ఆర్మీ బేస్ సీక్రెట్స్ అన్ని ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా అందిస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే గతంలో కూడా ఈ హానీ ట్రాప్‌కు పలువురు జవాన్లు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా చిక్కారని.. ఇప్పటికైనా జవాన్లు అప్రమత్తం కావాలని ఇండియన్ ఆర్మీ హెచ్చిరిస్తోంది.

Related Tags