బీ అలర్ట్… కార్యకర్తలకు రాహుల్ పిలుపు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. మరికొన్ని గంటల్లో విడుదలయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యకర్తలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఫలితాల ముందు సంయమనం కోల్పోరాదని, ఎవరికి భయపడవద్దంటూ ట్వీట్ చేశారు. నకిలీ ఎగ్జిట్ పోల్స్ దుష్ప్రచారానికి నిరాశ పడరాదని.. మీ కష్టం వృధా కాదని పేర్కొన్నారు. రాబోయే 24గంటలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసాన్ని ఉండండని పేర్కొన్నారు. ఏడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన అన్ని ఎగ్జిజ్ పోల్స్.. ఎన్డీఏకి జై […]

బీ అలర్ట్... కార్యకర్తలకు రాహుల్ పిలుపు
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 4:26 PM

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. మరికొన్ని గంటల్లో విడుదలయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యకర్తలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఫలితాల ముందు సంయమనం కోల్పోరాదని, ఎవరికి భయపడవద్దంటూ ట్వీట్ చేశారు. నకిలీ ఎగ్జిట్ పోల్స్ దుష్ప్రచారానికి నిరాశ పడరాదని.. మీ కష్టం వృధా కాదని పేర్కొన్నారు. రాబోయే 24గంటలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసాన్ని ఉండండని పేర్కొన్నారు.

ఏడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన అన్ని ఎగ్జిజ్ పోల్స్.. ఎన్డీఏకి జై కొట్టడంతో.. కాంగ్రెస్ శ్రేణులు డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో రాహుల్ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ట్వీట్ చేశారు.