లాక్ డౌన్ అమల్లో ఉంది.. మతపర కార్యక్రమాలకు ఫుల్ స్టాప్. కేంద్రం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉందని, అందువల్ల ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను గానీ, సామాజిక కార్యక్రమాలను గానీ ఎవరూ చేపట్టకుండా చూడాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఏ విధమైన ఫంక్షన్లు, సెలబ్రేషన్స్ జరగకుండా చూసేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఏప్రిల్ నెలలో కొన్ని పండుగలు, పబ్బాలు వస్తున్నందున ప్రజలు ఉత్సాహంగా వీటిని జరుపుకునేందుకు ఉవ్విళ్ళూరుతారు. బంధు మిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు […]

లాక్ డౌన్ అమల్లో ఉంది.. మతపర కార్యక్రమాలకు ఫుల్ స్టాప్. కేంద్రం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 11, 2020 | 3:36 PM

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉందని, అందువల్ల ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను గానీ, సామాజిక కార్యక్రమాలను గానీ ఎవరూ చేపట్టకుండా చూడాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఏ విధమైన ఫంక్షన్లు, సెలబ్రేషన్స్ జరగకుండా చూసేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఏప్రిల్ నెలలో కొన్ని పండుగలు, పబ్బాలు వస్తున్నందున ప్రజలు ఉత్సాహంగా వీటిని జరుపుకునేందుకు ఉవ్విళ్ళూరుతారు. బంధు మిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. అయితే కరోనా మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టనందున ప్రజలు విధిగా 21 రోజుల లాక్ డౌన్ పాటించాలని ఈ శాఖ హితవు చెప్పింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. భారత శిక్షా స్మృతి కింద వివిధ సెక్షన్లపై వారిపై చర్యలు తీసుకుంటారని కూడా హోమ్ శాఖ హెచ్చరించింది. అయితే కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా జరుపుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్ లో కొందరు చిన్నారులు కూడా పాల్గొనగా.. ఆయన మద్దతుదారులు, సన్నిహితులు సుమారు వంద మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఎవరూ సామాజిక దూరం పాటించిన దాఖలాలు కూడా కనబడలేదు.  ఆ ఫంక్షన్ దరిదాపుల్లో ఒక్క పోలీసు కూడాకనిపిస్తే ఒట్టు !. ఈ వీడియో వైరల్ అయింది. మరి పిల్లలతో సహా ఇంతమందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి ?