ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుకు కొవిడ్ పాజిటివ్

కరోనా వైరస్ ధాటికి అగ్ర రాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతుంది. నిత్యం వేలాది మంది కరోనా బారినపడుతుండగా, వందలాది మంది మృత్యువాత పడతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియాన్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుకు కొవిడ్ పాజిటివ్
Follow us

|

Updated on: Jul 27, 2020 | 9:38 PM

కరోనా వైరస్ ధాటికి అగ్ర రాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతుంది. నిత్యం వేలాది మంది కరోనా బారినపడుతుండగా, వందలాది మంది మృత్యువాత పడతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియాన్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకూ ఈ మహమ్మారి బారినపడ్డ అమెరికా అతున్నతస్థాయి అధికారి ఇతడే కావడం విశేషం. ఓబ్రియాన్‌కు తేలికపాటి కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ సోకినట్లు వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ఓబ్రియాన్ ఆరోగ్యం పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు.. ఆయన సురక్షితమైన ప్రదేశం నుంచి తన విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆ దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి వైరస్‌ సోకే అవకాశం లేదని వైట్ హౌజ్ స్పష్టం చేసింది. అలాగే, అమెరికా జాతీయ భద్రతా మండలి నిరంతరాయంగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని పేర్కొంది.