Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

సిరియాలో యుధ్ధ మేఘాలు.. ట్రంప్ మండిపాటు

టర్కీ-సిరియా మధ్య మెల్లగా యుధ్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. సిరియాలో క్రమేపీ టర్కీ సైనిక దళాలు ప్రవేశిస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న అంతర్యుధ్ధం ముదిరి పాకాన పడేట్టు కనిపిస్తోంది. తమ దేశ(సిరియా) సరిహద్దుల్లోని దాదాపు 36 లక్షల మంది శరణార్థులను తిప్పి పంపివేయడానికి సిరియా చేస్తున్న యత్నాలను టర్కీ ఖండిస్తోంది. సరిహద్దుల్లో ఓ సేఫ్ జోన్ ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు సిరియా అడ్డుకుంటోందని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆరోపిస్తున్నారు. ఈ బోర్డర్లో కొన్ని వారాలుగా సాగుతున్న తమ దేశ సైనిక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా తమ భద్రతా దళాలు సిరియాలో ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ‘ ఆక్రమణ ఏ సమయంలోనైనా జరగొచ్చు ‘ అని వార్నింగ్ ఇచ్చారు.

ఇక మన ‘ పెద్దన్న ‘ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. సిరియాపై మీరు మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారని టర్కీని దుమ్మెత్తిపోశారు. టర్కీ సైనికులకు, కుర్దుల ఆధ్వర్యంలోని సిరియన్ డెమొక్రటిక్ దళాలకు మధ్య ‘ బఫర్ ‘ (వారధి) గా వ్యవహరిస్తున్న సుమారు రెండు డజన్ల సైనిక దళాలను పెంటగాన్ (అమెరికా రక్షణ వ్యవస్థ) ఉపసంహరించుకోవడంతో టర్కిష్ దళాలు ముందుకు చొచ్ఛుకువచ్ఛే ప్రయత్నం చేస్తున్నాయి. తమ దేశ సైనికులు ఇక అక్కడ ఉండబోరని ట్రంప్ తాజాగా ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. టర్కీ-సిరియా దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతపట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇటు రిపబ్లికన్లు, అటు డెమొక్రాట్లు విమర్శల వర్షం కురిపిస్తుండడంతో ఈయన వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. టర్కీ ఒకవేళ హద్దు మీరి వ్యవహరిస్తే ఆ దేశ ఆర్ధిక పరిస్థితిని సమూలంగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ తీవ్రంగా హెచ్ఛరించారు. ఏమైనా ‘ ఒక ముగింపు అంటూ లేని ‘, ‘ తమాషా యుధ్ధాలకు
స్వస్తి చెబుదాం అని ట్రంప్ ట్వీటించారు.