‘మాకు మలేరియా నివారణ మందు ఇవ్వండి’.. మోదీకి ట్రంప్ విజ్ఞప్తి

కరోనా రోగుల చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు..' హైడ్రాక్సీక్లోరోక్విన్' ను తమ దేశానికి ఇవ్వవలసిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని కోరారు. ఈ విషయమై మోదీతో మాట్లాడానని...

'మాకు మలేరియా నివారణ మందు ఇవ్వండి'.. మోదీకి ట్రంప్ విజ్ఞప్తి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 05, 2020 | 11:25 AM

కరోనా రోగుల చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు..’ హైడ్రాక్సీక్లోరోక్విన్’ ను తమ దేశానికి ఇవ్వవలసిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని కోరారు. ఈ విషయమై మోదీతో మాట్లాడానని, దీన్ని మనదేశానికి అందజేసే అంశాన్ని ఇండియా తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యులతో మాట్లాడిన ఆయన.. తను కూడా ఈ టాబ్లెట్ ను వాడుతానని నిర్మొహమాటంగా చెప్పారు. ఈ మందు ఎగుమతిపై ఇండియా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరానన్నారు. డాక్టర్ల సలహాపై నేను కూడా ఈ మందు వాడతానని ట్రంప్ మళ్ళీ చెప్పారు .. ఇండియాలో ఈ మందు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కోట్లాది ప్రజలకు ఈ మందుతో అవసరం ఏర్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. మనం ఆర్డర్ చేసిన ఈ మెడిసిన్ ను భారత్ త్వరగా విడుదల చేస్తే నేనెంతో సంతృప్తి చెందుతాను అని కూడా అన్నారు. కాగా ఈ విషయమై ఫోన్ లో తామిద్దరం ఆత్మీయంగా మాట్లాడుకున్నామని, కరొనాను ఎదుర్కొనేందుకు భారత, అమెరికా దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని కోరానని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలో కరోనా మృతులకు మోదీ తీవ్ర సంతాపం తెలిపారు.

ఆదివారం నాటికి ఆ దేశంలో 3 లక్షల 1902 కరోనా కేసులు నమోదు కాగా.. 8,175 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 23,949 కేసులు నమోదయ్యాయి . అలాగే తాజాగా.. వెయ్యిమందికి పైగా మృతి చెందారు. ఒక అగ్ర రాజ్యం కరోనా కారణంగా మలేరియా నివారణ మందు కోసం ఇండియా వంటి వర్ధమాన దేశాన్ని కోరడం విశేషం.