‘హమ్మ ! ట్రంపూ ! జో బిడెన్ ని ఇలా ఆట పట్టిస్తున్నావా ? ‘

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రాట్ నామినీ జో బిడెన్ ని ఓడించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కొత్త కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. బిడెన్ ప్రెసిడెంట్ అయితే నేరాలను, హింసను ప్రోత్సహిస్తారని ఆరోపిస్తూ..

'హమ్మ ! ట్రంపూ ! జో బిడెన్ ని ఇలా ఆట పట్టిస్తున్నావా ? '
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 17, 2020 | 11:52 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రాట్ నామినీ జో బిడెన్ ని ఓడించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కొత్త కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. బిడెన్ ప్రెసిడెంట్ అయితే నేరాలను, హింసను ప్రోత్సహిస్తారని ఆరోపిస్తూ.. పోలీసులకు వ్యతిరేకంగా ఆయన ఓ పాట పాడారంటూ ఓ ఫేక్ వీడియోను వదిలాడాయన.. ఈ యాంటీ పోలీస్ ర్యాప్ సాంగ్ తో బిడెన్ పాపులారిటీ తగ్గించి ఆయన ఓడిపోవడానికి తనవంతు ప్రయత్నాలు తను చేస్తున్నాడు. ఈ వీడియోలో బిడెన్ చిరునవ్వులు నవ్వుతూ చిన్నగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. అంతేకాదు.. ఈ ప్రజల్లో ఎవరైనా టాలెంట్ ఉన్నవారెవరయ్యా అంటే అది నేనే ! నేనే ప్రెసిడెంటుగా ఎన్నికవుతా అని ఆయన అన్నట్టు ఈ వీడియోను మలిచాడు.

ఈ ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన ట్రంప్.. ఇది చూసి చైనా..’ఓ..భలే సంబరపడిపోతుంది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నిజానికి బిడెన్ ఆ పాట పాడలేదు. గత మంగళవారం ఫ్లోరిడా లో జరిగి న ప్రచారంలో ఆయన తన ఫోన్ తీసి ..’ డిస్పాసి టో’ అనే సాంగ్ ని ప్లే చేశారు. ఆ ఈవెంట్ లో లాటిన్ సింగర్ లూయీ ఫోన్సీ ని ఎవరో ఆయనకు ఇంట్రొడ్యూస్ చేశారు.