Breaking News
  • ఢిల్లీ: భారత్ లో కరోనా కల్లోలం. 5 లక్షల 48 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 5,48,318. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు:2,10,120. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 3,21,723. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 16,475. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తిరుమల: తిరుమలకు వచ్చే భక్తులకు క్రమం తప్పకుండా కరోనా టెస్టులు. టీటీడీ ఉద్యోగులకు రోజుకు వంద టెస్టులు చేయాలని నిర్ణయం. టెస్ట్ రిపోర్టులు 24 గంటల్లో వచ్చేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరిన టీటీడీ ఈఓ. టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం. బర్డ్ ఆసుపత్రిని కరోనా రోగులకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు వారంరోజులు ఒకేచోట విధులు కేటాయించాలని నిర్ణయం. టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్.
  • సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు రేపు భారత్-చైనా సైనికాధికారుల చర్చలు. కోర్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరగనున్న చర్చలు. ఇప్పటి వరకు 2 పర్యాయాలు సమావేశమైన భారత్-చైనా కోర్ కమాండర్లు. ఈసారి భారత భూభాగంలోని చుసుల్ వేదిక. తొలి రెండు సమావేశాలకు వేదిక చైనాలోని మోల్డో. ఉదయం గం. 10.30కు ప్రారంభంకానున్న భేటీ. భారత్ తరఫున 14 కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్. చైనా తరఫున సౌత్ జింజియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లుయిలిన్. భారత్ అభ్యంతరం వ్యక్తం చేసే అన్ని అంశాలపై చర్చ.
  • హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను తొలగింపునకు స్పెషల్ డ్రైవ్. వారం రోజుల్లో 15 అక్రమ నిర్మాణాలను తొలగించిన జిహెచ్ ఎంసీ ట్ర‌స్ట్ భూముల్లో నిర్మాణంలోవున్న 6 భవనాలను పూర్తిగా కూల్చివేసిన అధికారులు . చందానగర్ సర్కిల్ లో గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేశాం. ప్రభుత్వ భూములను కాపాడేందుకు జిహెచ్ఎంసీ సర్వే . - లోకేష్ కుమార్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్.
  • కృష్ణజిల్లా: వైసీపీ నేత భాస్కర రావు హత్య కేసులో కీలక ఆధారాల గుర్తించిన పోలీసులు. భాస్కరరావు ను హత్య చేసేందుకు మూడు రోజులు గా రెక్కీ. కత్తి తో హత్య చేసిన చింత పులి అనే వ్యకి గా గుర్తింపు.. హత్య చేసి అనంతరం బైక్ పై ఎక్కించికెళ్లిన నిందితుడు చింత చిన్ని. ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు. హత్యపై పొలిటికల్ వార్ వున్నట్టు అనుమానం. పరారీలో ఉన్న నిందితులు. నిందితుల కోసం 4 బృందాలు ఏర్పాటు.
  • హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో దారుణం . కుటుంబ కలహాలు నేపథ్యంలో సొంత అక్క చెల్లలను దారుణంగా హత్య చేసిన అన్న. ఈ దాడి లో ముగ్గురు మృతి . సంఘటన స్థలానికి చేరుకున్న చాంద్రాయణగుట్ట మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు . క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు.

మోదీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే..!

America President call to Modi, మోదీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే..!

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా జీ-7 సదస్సుకు రావాల్సిందిగా మోదీకి ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ”నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఈ సందర్భంగా జీ 7 సదస్సు, కరోనా విపత్కర పరిస్థితులతో పాటు పలు విషయాలపై ఇద్దరం చర్చించుకున్నాం. కరోనా తరువాత ప్రపంచ నిర్మాణంలో భారత్- అమెరికా మధ్య సంబంధాలు కీలక పాత్రను పోషించబోతున్నాయి” అని మోదీ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్‌, మోదీకి ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాని కార్యాలయం కూడా ధ్రువీకరించింది.

అమెరికాలో జరిగే తదుపరి జీ 7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా  మోదీని, ట్రంప్ కోరినట్లు తెలిపింది. అలాగే ఇరు దేశాల్లో కరోనా పరిస్థితి, అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, జీ-7 కూటమి, భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నట్లు వెల్లడించింది. కాగా జీ-7 కూటమిని విస్తరించాలనుకుంటున్న ట్రంప్.. అందులో భారత్‌ సహా మరో మూడు దేశాలను చేర్చాలనుకుంటున్న విషయం తెలిసిందే. సాధారణంగా జీ 7 సమావేశాలు జూన్‌లో జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌కి వాయిదా పడ్డాయి.

Read This Story Also: రెచ్చిపోయిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్‌ని ట్యాగ్ చేస్తూ పవన్ హీరోయిన్ ఘాటు ట్వీట్లు..!

Related Tags