Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Trump Love Story: రొమాంటిక్ సినిమాను తలపించే ట్రంప్- మెలానియా లవ్‌ స్టోరీ..!

ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకరు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ట్రంప్‌- మెలానియాల లవ్‌స్టోరీలో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య 24 ఏళ్ల అంతరం.. అయినప్పటికీ ప్రేమ చిగురించింది. అసలు
Donald Trump Love Story, Trump Love Story: రొమాంటిక్ సినిమాను తలపించే ట్రంప్- మెలానియా లవ్‌ స్టోరీ..!

ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకరు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ట్రంప్‌- మెలానియాల లవ్‌స్టోరీలో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య 24 ఏళ్ల అంతరం.. అయినప్పటికీ ప్రేమ చిగురించింది. అసలు వారిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగింది..? ప్రేమ ఎలా చిగురించింది..? మెలానియాతో వివాహం తరువాత ట్రంప్‌లో వచ్చిన మార్పులేమిటి..? ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఓ రొమాంటిక్ సినిమా స్టోరీనే ఉంది.

1970 ఏప్రిల్ 26న స్లోవేనియాలో జన్మించిన మెలానియా పుట్టుకతోనే అందగత్తె. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తి కలిగిన మెలానియా 16వ ఏటనే మోడలింగ్ రంగంలోకి అడుగెట్టారు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కలిగిన ఈమె.. ఎంతో కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 1998లో ఓ పార్టీలో ట్రంప్‌కు, మెలానియాకు పరిచయం ఏర్పడింది. తొలిచూపులోనే ట్రంప్‌తో మెలానియా ప్రేమలో పడ్డారట. అలాగే ట్రంప్‌ కూడా మొదటిసారి మెలానియాను చూసినప్పుడే ఫిదా అయ్యారట.

కాగా వీరిద్దరికి 24 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ వారు అదేం పట్టించుకోలేదట. ఇక రాను రాను ఈ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతూ వచ్చిందట. అది ఎంతలా అంటే..! ఇద్దరికి ఒకరిపై ఒకరికి చచ్చేంతగా. అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య లైన్ కుదరడంతో.. ఓ మంచి ముహూర్తానా వెంటనే మెలానియాకు రింగ్ తొడిగేశారట ట్రంప్. ఈ నేపథ్యంలో 2005లో మెలానాయాకు ట్రంప్‌తో వివాహమైంది. కానీ ట్రంప్ తెంపరితనం, అమ్మాయిల వ్యవహారాలు మెలానియాకు నచ్చలేదట. దీంతో ట్రంప్ కూడా మారుతూ వచ్చారట. ఇలా మొత్తానికి ట్రంప్‌ను మార్చిన ఘనత కూడా మెలానియాకే చెందుతుంది. ఏది ఏమైనా ప్రపంచ మీడియా దృష్టిలో వీరిద్దరు ఇప్పటికీ నెంబర్‌వన్‌ జంటగా కొనసాగుతుండటం విశేషం.

Related Tags