Trump India Visit: ‘బాహుబలి’గా ట్రంప్.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నమస్తే ట్రంప్ పేరుతో మోదీ ప్రభుత్వం ఓ పెద్ద సభను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. మరోవైపు

Trump India Visit: 'బాహుబలి'గా ట్రంప్.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:42 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నమస్తే ట్రంప్ పేరుతో మోదీ ప్రభుత్వం ఓ పెద్ద సభను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. మరోవైపు ట్రంప్ పర్యటనను కొంతమంది స్వాగతించినప్పటికీ.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ పక్కనపెడితే ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఓ ఇండియన్ అభిమాని ఆయన కోసం ఓ వీడియోను రూపొందించారు.

అందులో బాహుబలిలోని జియోరే బాహుబలి పాటను, సన్నివేశాలను వాడుకున్న ఆ అభిమాని ప్రభాస్ ఫేస్‌ను ట్రంప్‌తో మార్ఫింగ్ చేశారు. అలాగే ట్రంప్ కుటుంబసభ్యుల ఫొటోలను కూడా అక్కడక్కడ మార్ఫ్ చేశారు. వీరితో పాటు మోదీ, ఆయన సతీమణి జషోదాబెన్ ఫొటోలను కూడా ఈ వీడియోలో వాడారు. ఇక ఈ వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వీడియోపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇండియాలో ఉన్న నా స్నేహితులను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా అని ట్రంప్ కామెంట్ చేశారు.