Breaking News
  • చిత్తూరు: పలమనేరు మండలం మండిపేటలో ఎనుగుల విధ్వంసం. పంటపొలాలపై దాడి, కొబ్బరి చెట్లు ధ్వంసం. పశువులపైనా దాడి చేసిన గజరాజులు. దూడ మృతి, మరో ఆవుకు తీవ్ర గాయాలు. భయాందోళనలో రైతులు.
  • ప.గో: భీమడోలు మండలం పొలసానిపల్లిలో హత్యాయత్నం. భర్తను చంపేందుకు యత్నించిన భార్య. కూరలో సైనైడ్‌ కలిపి భర్తకు వడ్డించిన భార్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గురునాథ్‌. భార్య రాణి, కొడుకు సహా మరోముగ్గురిపై కేసు నమోదు.
  • హైదరాబాద్‌: పంజాగుట్టలో దొంగల బీభత్సం. అర్ధరాత్రి ముగ్గురు మహిళలు ఉన్న ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళలు. ఓ మహిళపై సుత్తితో దాడి చేసిన దొంగ. మహిళకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • సెల్ఫ్‌ డిసిప్లేన్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైన్‌లు వేసినంత మాత్రానా మార్పు రాదు. వాహనదారులు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. బయోడైవర్సిటీ ప్రమాదం తర్వాత అనేక చర్యలు చేపట్టాం. వాహనదారుల్లో మార్పు రాకుంటే నిర్దిష్ట వేగాన్ని కఠినంగా అమలు చేస్తాం. వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేవారు కూడా నష్టపోతున్నారు -టీవీ9తో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.
  • ఖమ్మం కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత. రెండు రోజుల క్రితం అదృశ్యమైన హాస్టల్‌ విద్యార్థి మృతదేహం లభ్యం. గోపాలపురం దగ్గర ఎన్‌ఎస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు. మృతదేహంతో కలెక్టరేట్‌ దగ్గర బంధువుల ఆందోళన.
  • అమరావతి: ఐటీ దాడుల పూర్తి పంచనామా రిపోర్ట్‌ విడుదల. భారీగా డైరీలు, రిజిస్టర్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన ఐటీశాఖ. కొన్ని విలువైన డాక్యుమెంట్లు సీజ్‌. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన లాకర్లు సీజ్‌ చేసినట్టు పంచనామాలో వెల్లడి.

జకోవిచ్‌ ఔట్.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు థీమ్‌

Dominic Thiem Enters In French Open Final, జకోవిచ్‌ ఔట్.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు థీమ్‌

ప్యారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. హోరాహోరీగా జరిగిన పోరులో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్‌ థీమ్‌ విజయం సాధించాడు. 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తేడాతో జకోను ఓడించాడు. మరోసారి వరుసగా అన్ని గ్రాండ్‌శ్లామ్‌ టైటిళ్లు రెండోసారి గెలవాలన్న అతడి కలను చిదిమేశాడు.

సెమీస్‌లో గెలుపుతో టెన్నిస్‌ చరిత్రలో లెజెండ్ రాడ్‌ లావర్‌ సరసన నివాలని జకోవిచ్‌ కలగన్నాడు. కానీ అతడి ఆశలను థీమ్‌ కల్లలు చేశాడు. ఫైనల్లో ‘క్లే కోర్ట్ కింగ్’ రఫేల్‌ నాదల్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఫైనల్లోనూ వీరిద్దరే తలపడ్డ సంగతి తెలిసిందే. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఆ పోరులో థీమ్‌ ఓడిపోయాడు. మరి ఈ సారైనా విజయం సాధిస్తాడేమో చూడాలి.

Related Tags