Breaking News
  • తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి. తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈశాన్య ఝార్ఖండ్, ఒరిస్సా మీదుగా 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఈరోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • టీవీ9తో హేమంత్‌ సోదరుడు. మా అన్నకు జరిగిన అన్యాయం మరొకరికి మళ్లీ జరగొద్దు. పెళ్లైనప్పటినుంచీ వదిన బంధువులు బెదిరిస్తూనే ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా నిందితులు బెదిరింపులకు దిగారు. వాళ్లే మారతారు, వదిలేద్దాం అని అవంతి చెబుతూ వచ్చింది. చిత్రహింసలు పెట్టి అవంతి కుటుంబసభ్యులు దారుణంగా చంపారు. హత్యకేసు నిందితుల నోటితోనే మీడియాకు నిజాలు చెప్పించాలి. కాలయాపన లేకుండా మా కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలి. -టీవీ9తో హేమంత్‌ సోదరుడు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

ఆల్‌ టైం రికార్డు స్థాయికి పసిడి ధర

పసిడి పరుగులు పెడుతూనే ఉంది. రోజు రోజుకి రికార్డు స్థాయికి చేరుకుంటుంది. బంగారం, వెండి ధరలు గురువారం ఆల్‌ టైం హైక్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ యల్లోమెటల్‌ ధర ఎగిసింది. గురువారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ధర అమాంతం 765 రూపాయలు భారమై తొలిసారిగా 55,863 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 4,074 రూపాయలు పెరిగి 75,967 రూపాయలకు ఎగబాకింది.

domestic gold futures surge all time record, ఆల్‌ టైం రికార్డు స్థాయికి పసిడి ధర

పసిడి పరుగులు పెడుతూనే ఉంది. రోజు రోజుకి రికార్డు స్థాయికి చేరుకుంటుంది. బంగారం, వెండి ధరలు గురువారం ఆల్‌ టైం హైక్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ యల్లోమెటల్‌ ధర ఎగిసింది. గురువారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ధర అమాంతం 765 రూపాయలు భారమై తొలిసారిగా 55,863 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 4,074 రూపాయలు పెరిగి 75,967 రూపాయలకు ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై పెనుప్రభావం చూపుతుందనే అంచనాల నడుమ మదుపుదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధలకు రెక్కలు వస్తున్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఏకంగా 2055 డాలర్ల ఆల్‌టైం హైకి చేరింది. అంతర్జాతీయం అమెరికన్‌ డాలర్‌ కూడా బలహీనపడటం, మదుపరులు పెట్టుబడులు షేర్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ సేఫ్ గా భావించడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. అటు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికన్‌ డాలర్‌ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందన్న అశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Tags