దేశీయ విమానాలు ప్రారంభమయ్యాయి.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో ప్రజా రవాణా మళ్లీ పునః ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు నెలల తర్వాత నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. 50 శాతం మంది ప్రయాణీకులతో పరిమితి సంఖ్యలో విమానాలను నడవనుండగా.. ఇప్పటికే ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం ఏడు కేటగిరీలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విమాన ప్రయాణీకుల క్వారంటైన్ విషయంలో రాష్ట్రాలు అన్నీ కూడా తలో విధంగా మార్గదర్శకాలను […]

దేశీయ విమానాలు ప్రారంభమయ్యాయి.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!
Follow us

|

Updated on: May 25, 2020 | 12:49 PM

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో ప్రజా రవాణా మళ్లీ పునః ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు నెలల తర్వాత నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. 50 శాతం మంది ప్రయాణీకులతో పరిమితి సంఖ్యలో విమానాలను నడవనుండగా.. ఇప్పటికే ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం ఏడు కేటగిరీలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విమాన ప్రయాణీకుల క్వారంటైన్ విషయంలో రాష్ట్రాలు అన్నీ కూడా తలో విధంగా మార్గదర్శకాలను ప్రకటించాయి.

కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్‌ సహా పలు రాష్ట్రాలు ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని రూల్స్ విధించగా.. కేరళ, పంజాబ్‌ రాష్ట్రాలు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించాయి. ఈ క్రమంలోనే ప్రయాణీకులు వారు వెళ్లే రాష్ట్రాలకు సంబంధించిన కరోనా మార్గదర్శకాలను ముందుగానే చూసుకోవాలని విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి. ఇక ఏపీలో రేపటి నుంచి విమాన సేవలు ప్రారంభం అవుతుండగా.. తెలంగాణలో మాత్రం ఇవాళ్టి నుంచే షురూ అయ్యాయి.

ప్రయాణీకులకు విమానం ఎక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అందరి మొబైల్ ఫోన్లలోనూ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలి. దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఎయిర్ పోర్టులలోకి అనుమతించరు. బోర్డింగ్, ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా విమానాశ్రయాల్లో ప్రయాణీకులు భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!