Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ వైద్యుడి మార్పు. మెంటల్ కేర్ ఆసుపత్రి డాక్టర్ రామిరెడ్డిని మార్చిన అధికారులు. రామిరెడ్డి స్థానంలో మహిళా డాక్టర్ కు ట్రీట్ మెంట్ బాధ్యతలు. డాక్టర్ రామిరెడ్డిపై ఆరోపణల నేపధ్యంలో నిర్ర్భయం తీసుకున్న ఆసుపత్రి అధికారులు. డాక్టర్ సుధాకర్ ట్రీట్ మెంట్ పొందే ఫోర్త్ యూనిట్ కు చీఫ్ గా వ్యవహరుస్తున్న డాక్టర్ రామిరెడి.
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • బంజారాహిల్స్ లో దారుణం. భార్యను హతమార్చిన భర్త. భార్య భర్తల గొడవతో హీటర్ తో బాధి హత్య చేసిన భర్త. తలకు గాయం కావడం తో మృతి చెందిన భార్య. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.
  • ఈరోజుతో ముగియనున్న సర్వేలేన్స్ సర్వే. ఎలిజా ప్రక్రియ ద్వారా రక్త నమూనా సేకరిస్తున్న ICMR ,NIN. జిహెచ్ఎంసి లోని ఐదు ప్రాంతాలలో ఈరోజు సర్వే. 18 సంవత్సరాలు పై బడిన అన్ని వయసుల వారికి టెస్టులు చేస్తున్న NIN. ఒక్కో కంటైన్మెంట్ జోన్ 100 శాంపిల్స్ తీసుకుంటున్న ICMR,NIN అధికారులు. మొత్తం రంగారెడ్డి,ghmc లలో 500 శాంపిల్స్ తీసుకోనున్న బృందాలు. మొత్తం సిరం శాంపిల్స్ ను చెన్నై పంపనున్న ICMR,NIN అధికారులు.
  • తిరుపతి లో గంజాయి మత్తుగాళ్ళ హాల్ చల్ . తాతయ్యగుంట లో గంజాయి మత్తులో యువకుడి పై కత్తితో దాడి . శనివారం రాత్రి సంఘటన . దాడికి పాల్పడిన ఆరుగురు దుండగులు . కతిదాడిలో తీవ్రంగా గాయపడిన వెంకట సాయి (15). రుయా ఆసుపత్రి కి తరలింపు... ప్రాథమిక చికిత్స . తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

క‌రీంన‌గ‌ర్ జిల్లాకు కొత్త‌భ‌యం..మిస్ట‌రీగా కుక్క‌ల మృతి

క‌రీంన‌గ‌ర్ జిల్లాను ఇప్పుడు మ‌రో కొత్త భ‌యం వెంటాడుతోంది. అంతుచిక్క‌ని రోగంతో ప‌దుల సంఖ్య‌లో వీధి కుక్క‌లు మ‌ర‌ణించ‌టంతో జిల్లా వాసులు వ‌ణికిపోతున్నారు...
Dog's death in karimnagar turns into a new mistery !, క‌రీంన‌గ‌ర్ జిల్లాకు కొత్త‌భ‌యం..మిస్ట‌రీగా కుక్క‌ల మృతి
అస‌లే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్నవేళ కొత్త సంఘ‌ట‌న‌లు ప్ర‌జ‌ల్ని మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్న‌ట్టుండి మూగ‌జీవాలు మృత్యువాత ప‌డుతుండ‌టం క‌ల‌వ‌రం రేపుతోంది. ఇప్ప‌టికే కోవిడ్ 19 వైర‌స్ కోర‌ల్లో చిక్కుకున్న తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లాను ఇప్పుడు మ‌రో కొత్త భ‌యం వెంటాడుతోంది. అంతుచిక్క‌ని రోగంతో ప‌దుల సంఖ్య‌లో వీధి కుక్క‌లు మ‌ర‌ణించ‌టంతో జిల్లా వాసులు వ‌ణికిపోతున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని ఓడేడ్ గ్రామంలో వరుసగా వీధి కుక్కలు మరణిస్తుండటం కలక‌లం రేపుతోంది. ఉన్నట్టుండి 12 కుక్కలు మరణించడంతో ఏం జరిగిందోనని గ్రామ‌స్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ జూలో పులికి కూడా కరోనా వ్యాపించడంతో కుక్కలకు కూడా ఏదైనా వింత రోగం వచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పశువైద్యాధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
గ్రామంలో మూడు రోజుల క్రితం కరోనా వైరస్ ప్రభలకుండా ఉండటానికి శానిటైజర్లు చల్లారు.హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో అది పడిన ఆహారం, నీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. పిచికారీ చేసిన  తర్వాతే శునకాలు మరణిస్తున్నందున ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో వాటికి తిండిలేక కూడా మరణించే అవకాశం ఉందంటున్నారు.

Related Tags