కుక్కకు ఓటు హక్కు.. సోషల్ మీడియాలో సెటైర్లు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వారు చేస్తోన్న మార్పుల్లో ఎన్నో తప్పులు బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న కర్నూల్‌లో ఓ మహిళా ఓటర్‌ ఫొటో స్థానంలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఫొటో దర్శనమివ్వగా.. తాజాగా ఏలూరులో కుక్కకు ఓటు హక్కు కల్పించారు అధికారులు. ఏలూరు 12వ డివిజన్‌కు చెందిన బన్నీ గార అనే వ్యక్తికి సీరియల్ నెంబర్ 5928తో 194వ […]

కుక్కకు ఓటు హక్కు.. సోషల్ మీడియాలో సెటైర్లు..!
Follow us

| Edited By:

Updated on: Feb 11, 2020 | 4:38 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వారు చేస్తోన్న మార్పుల్లో ఎన్నో తప్పులు బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న కర్నూల్‌లో ఓ మహిళా ఓటర్‌ ఫొటో స్థానంలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఫొటో దర్శనమివ్వగా.. తాజాగా ఏలూరులో కుక్కకు ఓటు హక్కు కల్పించారు అధికారులు.

ఏలూరు 12వ డివిజన్‌కు చెందిన బన్నీ గార అనే వ్యక్తికి సీరియల్ నెంబర్ 5928తో 194వ పోలింగ్ బూత్‌లో కొత్తగా ఓటు హక్కు కల్పించారు. అయితే ఆ వ్యక్తి ఫొటో బదులుగా కుక్క ఫొటోను ముద్రించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికారుల తీరుపై నెటిజన్లు సైటర్లు వేస్తున్నారు. మన అధికారుల తీరు భేష్ అంటూ సెటైరికల్‌గా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు అదే డివిజన్‌లో ఎప్పుడో మరణించిన బాలకృష్ణకాశీకి రెండు సీరియల్ నెంబర్లతో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కల్పించారు. అలాగే 13వ డివిజన్‌లో మహిళా ఓటరు వల్లూరి అరుణకు ఏకంగా ఏడు చోట్ల ఓటు హక్కు కల్పించారు. అంతేనా 11వ డివిజన్‌లో షేక్ మీర్ అలీ, శ్రీనివాసరావు అనే వ్యక్తులకు వేర్వేరు సీరియల్ నెంబర్లు, పోలింగ్ బూతుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు కల్పించారు. ఇలా ఒకటి, రెండు కాదు ఓటర్ కార్డుల్లో చాలా తప్పులనే చూపించారు అధికారులు. దీంతో రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా నోరెళ్లబెడుతున్నారు.