Breaking News
  • దేశంలో కరోన బాధితుల సంఖ్య 4789కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 4312 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 352మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 124 మంది మృతి. సాయంత్రం 6.00 గంటల వరకు వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 508 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13మంది మృతి.
  • శరవేగంగా రూపుదిద్దుకున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌. అత్యాధునిక ఐసోలేషన్‌ సెంటర్‌గా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌. అంతర్జాతీయ స్థాయిలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉన్న సదుపాయాలు. మొత్తం 14 అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వెంటిలేటర్‌ సదుపాయం. ఇప్పటికే మూడు అంతస్తుల్లో 1,500 బెడ్స్‌ సిద్ధం. ఒక్కో ఫ్లోర్‌కు 36 గదులు, ప్రతి గదిలో 2 బెడ్స్‌. మరో 11 ఫ్లోర్లు శరవేంగా సిద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ. రోజుకు 24 గంటలు 1,200 మంది వైద్య సిబ్బంది విధులు. ఉస్మానియా ఆస్పత్రికి అనుసంధానంగా పని చేయనున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది.. విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానితులందరినీ ఇప్పటికే క్వారంటైన్, ఐషోలేషన్ కేంద్రాలకు తరలించిన అధికారులు.. ఇంటింటి సర్వేను కూడా మరోసారి వేగవంతం చేశారు.
  • భారత్‌ దగ్గర సరిపడ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉంది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు-లవ్‌ అగర్వాల్‌.
  • లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రంపై వివిధ రాష్ట్రాల ఒత్తిడి. లాక్‌డౌన్‌ పొడిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీని కోరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌ బాటలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ఠాక్రే. లాక్‌డౌన్‌ను పొడిగించాలిన కేంద్రాన్ని కోరిన యూపీ సర్కార్‌.

షాకింగ్.. కుక్క పిల్లలకు కూడా కరోనా..!

ఇప్పటి వరకు మనుషులకే కరోనా వచ్చిందని అనుకుంటున్న తరుణంలో హాంకాంగ్ వైద్యులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మనుషులకే కాదు.. కుక్క పిల్లలకు కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాపిస్తోందని తెలిపారు.
Dog in Hong Kong has tested positive for coronavirus, షాకింగ్.. కుక్క పిల్లలకు కూడా కరోనా..!

ఇప్పటి వరకు మనుషులకే కరోనా వచ్చిందని అనుకుంటున్న తరుణంలో హాంకాంగ్ వైద్యులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మనుషులకే కాదు.. కుక్క పిల్లలకు కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాపిస్తోందని తెలిపారు. హాంకాంగ్‌లో నివసిస్తున్న ఓ మహిళతో పాటుగా.. ఆమె పెంచుకుంటున్న కుక్క పిల్లకు కూడా కరోనా సోకిందని వైద్యులు తెలిపారు.

హాంకాంగ్‌లో జుహాయ్‌ మకావో వంతెనకు సమీపంలో నివసిస్తున్న యువన్నె చెవ్‌ అనే వృద్ధ మహిళకు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.దీంతో వెంటనే ఆమెను అదే రోజు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. అయితే ఆ తరువాతి రోజు.. వైద్య అధికారులు ఆమె ఇంటికి వెళ్లి ఆమె పెంపుడు కుక్క పిల్లను తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. వచ్చిన రిజల్ట్స్ చూసి.. షాక్ తిన్నారు. ఆ పరీక్షలో ఆ కుక్క పిల్లకు కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆ కుక్క పిల్లను కూడా 14 రోజులపాటు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు.

అయితే ఈ సమాచారం తెలిసిన వెంటనే హాంకాంగ్‌లోని ప్రజలు వారివారి పెంపుడు జంతువులకు మాస్క్‌లు తగిలిస్తున్నారు. కాగా.. కోవిడ్‌ సోకిన కుక్క పిల్లల నుంచి తిరిగి మనుషులకు సోకుతున్నట్లు ఇప్పటి వరకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యులు తెలిపారు.మరోవైపు.. చైనాలోని వుహాన్‌ మార్కెట్‌ నుంచి బయటపడిన ఈ కరోనా వైరస్..ఇంత వరకు కుక్కలకు, పిల్లులకు సోకినట్లు ఎక్కడా కూడా వార్తలు రాలేదు. పెంపుడు కుక్కల నుంచి యజమానులకుగానీ, యజమానుల నుంచి పెంపెడు కుక్కలకుగానీ ఈ వైరస్‌ సోకదని.. “యూసీ డేవిస్‌ స్కూల్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్‌” ప్రొఫెసర్ డాక్టర్‌ నీల్స్‌ పెడర్సన్‌ స్పష్టం చేశారు. అయితే ఇంకా ఈ విషయంపై హాంకాంగ్‌ వైద్యాధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు.

Related Tags