షాకింగ్‌.. జార్జియాలో పెంపుడు కుక్కకు కరోనా..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సోకడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇది మనుషులకే కాదు..

షాకింగ్‌.. జార్జియాలో పెంపుడు కుక్కకు కరోనా..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 11:24 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సోకడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇది మనుషులకే కాదు.. కొన్ని జంతువులకు కూడా సోకుతుండటం కలకలం రేపుతోంది. గతంలో హాంకాంగ్‌లో పిల్లికి కరోనా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక యూఎస్‌లో పులులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. అట్లాంటాలోని జార్జియా దేశంలో ఓ పెంపుడు కుక్కకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆరు ఏళ్లు ఉన్న ఓ హైబ్రీడ్‌ కుక్క.. నాడీ వ్యవస్థకు సంబంధించి అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని.. దాని యజామానులు గుర్తించారు. దీంతో దానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా ప్రభావంతోనే కుక్క నాడీ వ్యవస్థకు సంబంధించి అనారోగ్యం పాలైందన్నారు.