మీ పప్పీకి జ్వరముంటే మీకూ వస్తుందా?

Dog, మీ పప్పీకి జ్వరముంటే మీకూ వస్తుందా?

పెంపుడు జంతువుల మీద ఎనలేని మమకారం చూపడం చాలామందికుండే ‘మంచి’ అలవాటు. వాటికి చిన్న జబ్బు చేసినా వీళ్ళు ఓర్చుకోలేరు. అక్కున చేర్చుకుని తల నిమురుతారు.. బొచ్చు పీకుతూ వాటిని సేదతీర్చడానికి నానా తంటాలు పడతారు. కానీ.. ఇలా అతి చేయడం లేనిపోని అనర్థాలకు దారి తీస్తుందట. పెంపుడు కుక్కలకు తరచూ వచ్చే canine brucellosis వ్యాధి.. వాటినుంచి మనుషులకు సోకే అవకాశం ఉందని పేరుమోసిన వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.

అమెరికాలోని మరియన్ కౌంటీ ప్రాంతంలో కమర్షియల్ బ్రీడింగ్ కోసం తీసుకొచ్చే పెంపుడు కుక్కల్లో canine brucellosis జబ్బు ఎక్కువగా సోకుతుందట. వాటితో వృత్తి రీత్యా సన్నిహితంగా ఉంటున్న హెల్పర్స్ కూడా ఈ తరహా వ్యాధికి గురైనట్లు కొన్ని వందల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ వ్యాధి పీడిత కుక్కల్ని నిర్బంధించి.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. వాటి యజమానులకు వర్తమానం పంపించారు. వాళ్ళ ఆరోగ్యాల్ని లోతుగా పరీక్షించారు. కీళ్ల నొప్పులు, జ్వరం, అధికంగా చెమట పట్టడం లాంటి లక్షణాలే కాకుండా.. తీవ్రమైన ఆర్టిరైటిస్, గుండె ఉబ్బి ఊపిరాడక పోవడం లాంటి ప్రాణాంతక వ్యాధులు రావొచ్చని, అందుకే పెంపుడు కుక్కలతో కాస్త దూరం పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *