Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

రైల్వే జాగిలం..ఫుట్‌బోర్డింగ్‌ చేశారో పనిపడుతుంది..!

This dog at Chennai Railway Station has dedicated itself to assisting the protection force, రైల్వే జాగిలం..ఫుట్‌బోర్డింగ్‌ చేశారో పనిపడుతుంది..!

బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పడు..చాలా మంది ఫుట్‌బోర్డింగ్‌ చేస్తుంటారు..లోపల ఖాళీగా ఉన్నప్పటికీ మెట్లపైనే నిల్చుని ప్రయాణిస్తుంటారు. అధికారులు, స్థానికులు ఎంత చెప్పినా వారు తమ తీరు మార్చుకోరు సరికదా..చాలా సార్లు చాల మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్ని సార్లు పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించటంతో అందరూ దానిని లైట్‌గా తీసుకుంటున్నారు. కానీ, అక్కడ మాత్రం రైళ్లో ఫుట్‌బోర్డింగ్‌ చేస్తామంటే..ఆ కుక్క మీమల్ని వదిలిపెట్టదు. లోపలికి వెళ్లే వరకు వెంటాడుతుంది. ఆ రైల్వే జాగిలానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొడుతోంది.
చెన్నైలోని పార్క్‌టౌన్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్న ఆ కుక్క పేరు చిన్నపొన్ను. కొన్ని రోజుల క్రితం అది రైల్వే స్టేషన్‌లో కనిపించిందట. చిన్నపొన్ను యజమాని ఇంట్లో దాని గోల భరించలేక స్టేషన్లో వదిలేసి పోయాడట. దానిని చూసిన రైల్వే పోలీసు శాఖ సభ్యులు కొందరు చిన్నపొన్నును పెంచుకుంటున్నారు. వారితో పాటుగానే దానిని కూడా డ్యూటీకి తీసుకువెళ్లడం ప్రారంభించారు. అలా అది వారు చేస్తున్న డ్యూటీని అర్థం చేసుకుంది..విశ్వాసంతో ఆర్‌పీఎఫ్‌ దళంతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. రైళ్లలో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నా, రన్నింగ్‌ రైలు ఎక్కినా, దిగినా, ఫ్లాట్‌ఫాం మారేందుకు పట్టాలు దాటుతున్న ప్రయాణికులను హెచ్చరిస్తుంది. అధికారులు కొన్ని సార్లు చూసి చూడనట్టుగా వదిలేసినా ఆ కుక్క మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టదు. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉందట..ఎవరై అనుమానాస్పద వ్యక్తులు, దొంగలు తనకంట పడితే చాలు వెంటనే వారిని పసిగట్టేస్తుందట. దీంతో అధికారులకు తమ డ్యూటీ చాలా సులభం అయిపోయిందని చెబుతున్నారు.