అభినందన్ ను రాజకీయంగా కూడా వాడేస్తున్నారా..?

పుల్వామా ఆత్మాహుతి దాడి అనంతరం భారత్ వాయుసేన పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మిషన్ సక్సెస్ అవడానికి కారణమైన వ్యక్తి  వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. ఈ దాడి సమయంలో ఆయన్ని పాకిస్తాన్  సైన్యం తమ భూభాగంలో అదుపులోకి తీసుకుని, మార్చి 1న తిరిగి భారత అధికారులకు అప్పగించింది. దీంతో ఒక్కసారిగా అభినందన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో ఆయన ఫోటో ఒకటి […]

అభినందన్ ను రాజకీయంగా కూడా వాడేస్తున్నారా..?
Follow us

|

Updated on: Apr 17, 2019 | 9:11 PM

పుల్వామా ఆత్మాహుతి దాడి అనంతరం భారత్ వాయుసేన పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మిషన్ సక్సెస్ అవడానికి కారణమైన వ్యక్తి  వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. ఈ దాడి సమయంలో ఆయన్ని పాకిస్తాన్  సైన్యం తమ భూభాగంలో అదుపులోకి తీసుకుని, మార్చి 1న తిరిగి భారత అధికారులకు అప్పగించింది. దీంతో ఒక్కసారిగా అభినందన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు.

ఇది ఇలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో ఆయన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీకి బహిరంగంగా మద్దతు పలుకుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఓటు కూడా వేశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉంది.

“ప్రస్తుతం మోదీకన్నా సమర్థుడైన ప్రధాని ఎవరూ లేరని, ఓ సైనికుడిని ఇంతవరకూ ప్రాణాలతో తిరిగి తీసుకురాలేదనే విషయాన్ని జిహాదీలు, కాంగ్రెస్ పార్టీ తెలుసుకునేలా చెయ్యాలి” అని ఆ ఫొటో కింద రాసి ఉంది. ఇది చూస్తుంటే అభినందన్‌కు వచ్చిన పాపులారిటీని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తోంది. ‘నమో భక్త్’ వంటి రైట్ వింగ్ ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఈ పోస్టు షేర్ అయ్యింది. ‘మోదీ సేన’ వంటి మరికొన్ని గ్రూపులు దీనికి మరింత ప్రచారాన్ని కల్పించాయి. ఇప్పటికే వేలాదిమంది ఈ పోస్ట్‌‌ను చూసి..షేర్‌ చేస్తున్నారు.

మరోవైపు కొంతమంది ఈ వార్తలో నిజం లేదని.. ఆ ఫొటోలో కనిపించేది అభినందన్ వర్ధమాన్ కాదని.. ఆయనలా ఉన్న డూప్ అని అంటున్నారు. దీనితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ఆ ఫొటోలో ఉన్నది వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కాదని నిర్ధారించారు.

ఇక సోషల్ మీడియాలో అభినందన్ పేరుతో పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ అధికారక ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి మనకి తెలిసిందే.