“మీరు చక్కెర కలిపిన టీ తాగుతున్నారా”.. ఐతే ఒక్కమాట

రోజు తెల్లవారిందీ  అంటే నోటికి వేడి వేడి ఛాయ్ నోటికి అందాల్సిందే. మరి అలాంటి తేనీటికి రుచి అందించేది చక్కెరే కదా.  ఇప్పుడు ఈ తీపితోనే తంటా వచ్చి పడింది. చక్కెర కలిపిన టీ తాగితే మీ మునిగినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చక్కెర కలిపి జ్యూస్‌లు తాగినా సరే అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టేనట. అదేంటీ.. కాస్త నిస్సత్తువ ఆవరిస్తే తీపి తినమంటారు కదా అనుకోకండి. అసలు విషయం అక్కడే ఉంది మరి. ఫ్రాన్స్‌లో జరిపిన […]

మీరు చక్కెర కలిపిన టీ తాగుతున్నారా.. ఐతే ఒక్కమాట
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 4:34 AM

రోజు తెల్లవారిందీ  అంటే నోటికి వేడి వేడి ఛాయ్ నోటికి అందాల్సిందే. మరి అలాంటి తేనీటికి రుచి అందించేది చక్కెరే కదా.  ఇప్పుడు ఈ తీపితోనే తంటా వచ్చి పడింది. చక్కెర కలిపిన టీ తాగితే మీ మునిగినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చక్కెర కలిపి జ్యూస్‌లు తాగినా సరే అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టేనట.

అదేంటీ.. కాస్త నిస్సత్తువ ఆవరిస్తే తీపి తినమంటారు కదా అనుకోకండి. అసలు విషయం అక్కడే ఉంది మరి. ఫ్రాన్స్‌లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం చక్కెర కలిపిన ఛాయ్ తాగినా, లేక పళ్ల రసాలను తీసుకున్నా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. రెండు టేబుల్ స్పూన్ల చక్కర వేసుకుని టీ తాగినా క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట. చక్కెర కలవడంతో పళ్ల రసాలు, టీ వంటివి క్యాన్సర్‌కు కారణమవుతుందని తేల్చారు. అయితే వయసును బట్టి చక్కెర స్ధాయిని తగ్గించి తీసుకుంటే మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవట.

మార్కెట్లో రెడీమేడ్‌గా లభించే కూల్‌డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్‌లలో  అధికంగా చక్కర కలుపుతారు గనుక వీటితో కూడా క్యాన్సర్‌కు అవకాశాలున్నాయట.  ఫ్రాన్స్  దేశంలో తయారయ్యే అన్ని రకాల డ్రింక్స్‌లలో చక్కెర స్ధాయిని తగ్గించాలని శాస్త్రవేత్తలు అక్కడి ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. మరి టీ, జ్యూస్‌లు తాగే అలవాటున్నవారు ఎవరైనా ఉంటే ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడితే మంచిదేమో..