అచ్చొచ్చిన నంబర్… మహేష్ సెంటిమెంట్

బయటికి కనిపించకపోయినా.. మన హీరోహీరోయిన్లకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఈ సెంటిమెంట్లకు స్టార్ హీరోలు మినహాయింపేం కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో మొదలెడితే ఆ తరువాత జనరేషన్ అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునలు సెంటిమెంట్లను బాగా నమ్మేవారు. ఇక ఇప్పటి స్టార్ హీరోలలో ఎన్టీఆర్‌‌ సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతాడని.. ముఖ్యంగా నంబర్‌లలో 9ను ఆయన బాగా నమ్ముతారని ఎన్టీఆర్ సన్నిహితులు పలు సందర్భాలలో చెప్పారు. అందుకే తన కార్ల నంబర్లలోనూ 9 ఉండేలా ఆయన […]

  • Manju Sandulo
  • Publish Date - 4:54 pm, Mon, 2 December 19

బయటికి కనిపించకపోయినా.. మన హీరోహీరోయిన్లకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఈ సెంటిమెంట్లకు స్టార్ హీరోలు మినహాయింపేం కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో మొదలెడితే ఆ తరువాత జనరేషన్ అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునలు సెంటిమెంట్లను బాగా నమ్మేవారు. ఇక ఇప్పటి స్టార్ హీరోలలో ఎన్టీఆర్‌‌ సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతాడని.. ముఖ్యంగా నంబర్‌లలో 9ను ఆయన బాగా నమ్ముతారని ఎన్టీఆర్ సన్నిహితులు పలు సందర్భాలలో చెప్పారు. అందుకే తన కార్ల నంబర్లలోనూ 9 ఉండేలా ఆయన చూసుకుంటారని టాక్.

అయితే ఇప్పుడు అదే నంబర్‌ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు కూడా సెంటిమెంట్ అయినట్లు తెలుస్తోంది. ముందు సినిమాలకు కాకపోయినా.. ‘మహర్షి’ సినిమా నుంచి 9 నంబర్‌ను మహేష్ బాగా నమ్ముతున్నట్లు అర్థమవుతోంది. దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ‘మహర్షి’ సినిమాను మే9న విడుదల చేయగా.. ఆ మూవీ పాటలు, పోస్టర్లు, టీజర్ విడుదల సమయాల్లోనూ 9 గానీ, దాని గుణింతాలు(అంటే 18) వచ్చేలా చూసుకున్నాడు. అంటే ‘మహర్షి’లోని ‘చోటి చోటి బాతే’, ‘నువ్వే సమస్తం’, ‘పదర పదర’ ఈ పాటలన్నీ సాయంత్రం గం.4.05నిమిషాలకు విడుదలయ్యాయి. వాటిని కలిపితే (4+5)9 వస్తుంది. అలాగే ‘మహర్షి’ టీజర్‌ను గం.9.09లకు విడుదల చేశారు. ఇలా ఆ సినిమా పోస్టర్లు, టీజర్ల విడుదల సమయం 9 గానీ, 9 గుణింతాలతో గానీ ఉంది. ఇక ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా అదే ఫాలో అవుతున్నాడు మహేష్. ఈ సినిమా టీజర్ నవంబర్ 22న సాయంత్రం గం.5.04 నిమిషాలకు విడుదల కాగా.. ఇవాళ ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే మొదటి పాట కూడా అదే సమయానికి రిలీజ్ అవ్వనుంది. అంతేకాదు మిగిలిన పాటలు కూడా ఇలానే విడుదల చేయబోతున్నట్లు టాక్. మరి 9 సెంటిమెంట్ ‘మహర్షి’ చిత్రానికి బాగానే వర్కౌట్ అవ్వగా.. ‘సరిలేరు నీకెవ్వరు’కు ఏ మాత్రం అచ్చొస్తుందో చూడాలంటే ఇంకో నెల రోజులకు పైగా వేచి చూడాల్సిందే.

అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా.. ఆయన సరసన రష్మిక కనిపిస్తోంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.