లాక్‌డౌన్‌ పాటించ‌క‌పోతే..? ఇండియా మ‌రో శ‌వాల దిబ్బగా మారుతోందా..?

ఏప్రిల్‌ 14 తర్వాత ఏం జరగబోతోంది..? 21 రోజుల లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా? పొడిగిస్తారా? అప్పటి వరకు కరోనా మహమ్మారి కంట్రోల్‌లోకి వస్తుందా? అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరోనా అదుపులోకి రాకపోతే ఏం చర్యలు తీసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్నాయి.. వీటిపైనే అంతటా చర్చ సాగుతోంది. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు ప్రధానమంత్రి కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలెర్ట్‌గా ఉన్నారు. పరిస్థితిని బట్టి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే […]

లాక్‌డౌన్‌ పాటించ‌క‌పోతే..? ఇండియా మ‌రో శ‌వాల దిబ్బగా మారుతోందా..?
Follow us

|

Updated on: Mar 27, 2020 | 3:23 PM

ఏప్రిల్‌ 14 తర్వాత ఏం జరగబోతోంది..? 21 రోజుల లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా? పొడిగిస్తారా? అప్పటి వరకు కరోనా మహమ్మారి కంట్రోల్‌లోకి వస్తుందా? అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరోనా అదుపులోకి రాకపోతే ఏం చర్యలు తీసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్నాయి.. వీటిపైనే అంతటా చర్చ సాగుతోంది. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు ప్రధానమంత్రి కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలెర్ట్‌గా ఉన్నారు. పరిస్థితిని బట్టి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అందరి మనసులోనూ ఉన్న ఒకే ఒక్క ప్రశ్న….21 రోజుల తర్వాత ఏం జరగబోతుంది? చైనా తర్వాత అమెరికా, ఇటలీలలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాళ్లు కొంచెం ఆలస్యంగా స్పందించడం వల్లే అక్కడ పరిస్థితి చేయిదాటిపోయింది.

ఇది గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ, అమెరికాలోలాగ పెద్ద ఎత్తున మరణాలు సంభవించకూడదని 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. అందులో మొదటిది వైరస్‌ పెద్ద ఎత్తున ప్రబలితే లక్షల మందికి చికిత్స చేసే మౌలిక వసతులు మన దేశంలో లేవు. ఇక రెండో కారణం.. జనాభా పరంగా చూసినా, భౌగోళికంగా చూసినా మన దేశంలో పరిస్థితులు అదుపు తప్పితే కంట్రోల్‌ చేయడం సాధ్యం కాదు. ఇటలీలోలాగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తే … ఒక్కసారి జనంలో భయం మొదలైతే పరిస్థితులు చేయిదాటిపోతాయి. అందుకోసమే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే కఠినమైన నిర్ణయాలు ప్రకటించారంటున్నారు. ఇక మూడో కారణం మన దేశంలో వైద్యుల సంఖ్య కూడా తక్కువే. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సరిపడా డాక్టర్లు లేరు. కరోనా బాధితులు పెరిగితే వారికి సరిపడా బెడ్లు, వెంటిలేటర్లు లేవు. ఇలాంటి పరిస్థితులలో వైరస్‌ విజృంభిస్తే కచ్చితంగా సమస్యల్లో చిక్కుకుపోవడమే అవుతుంది. మ‌న‌దేశం కూడా మ‌రో శ‌వాల దిబ్బ అవుతంది. కానీ ఇండియా ప్ర‌జ‌లు దూరంగా ఉంటూనే స‌మైఖ్య‌త‌ను చాటుతున్నారు. చాట‌బోతున్నారు. మ‌హమ్మారి వైర‌స్ ఎదురించి గెల‌వ‌బోతున్నారు.

 *లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిద్దాం.. నన్ను, నిన్ను, మ‌న దేశాన్ని కాపాడుకుందాం…*

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..