ఈయనను ఎవరైనా గుర్తు పట్టారా?.. బాబ్ బిస్వాన్‌తో అదరగొడుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్..

బట్టతలతో కళ్లజోడు పెట్టుకొని కోర్టుకు హాజరవుతున్నబాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ విభిన్న సినిమాలలో నటిస్తూ తనకుంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఈయనను ఎవరైనా గుర్తు పట్టారా?.. బాబ్ బిస్వాన్‌తో అదరగొడుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 1:11 PM

బట్టతలతో కళ్లజోడు పెట్టుకొని కోర్టుకు హాజరవుతున్నబాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ విభిన్న సినిమాలలో నటిస్తూ తనకుంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. తండ్రికి తగిన తనయుడిగా ప్రశంసలందుకుంటున్నాడు. ప్రస్తుతం అభిషేక్ బాబ్ బిస్వాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఫొటోలు ఈ సినిమాలోని సన్నివేశానియే. ప్రస్తుతం ఈ చిత్రం కోల్‌కతాలో షూటింగ్ జరుపుకుంటోంది.

2012లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన కహానీ సినిమాలో సైకో కిల్లర్‌గా ఓ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పేరు బాబ్ బిశ్వాస్. బెంగాలీ నటుడు సస్వతా ఛటర్జీ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టాడు. ఈ క్యారెక్టర్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ఈ పాత్రనే చేస్తున్నాడు. ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం బాబ్ బిస్వాన్ సినిమాను సుజోయ్‌ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ డైరెక్ట్ చేస్తోంది. ఇది ఆమెకు మొదటి సినిమా కాగా ఇందులో చిత్రాంగద హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఢిపరెంట్ స్టైల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్