ఇండిగో విమానంలో జర్మన్ హల్ చల్

గోవా నుండి డిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం లో జర్మనీ దేశానికి చెందిన ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విమానం బాత్రూంలో ఇతను బట్టలు విప్పుకొని పడి ఉండటం గమనించిన ఇండిగో విమాన సిబ్బంది.. వెంటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ రిక్వెస్ట్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన వెంటనే అనుమానాస్పద వ్యక్తిని సిఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత శంషాబాద్ […]

  • Rajesh Sharma
  • Publish Date - 3:36 pm, Fri, 11 October 19
ఇండిగో విమానంలో జర్మన్ హల్ చల్

గోవా నుండి డిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం లో జర్మనీ దేశానికి చెందిన ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విమానం బాత్రూంలో ఇతను బట్టలు విప్పుకొని పడి ఉండటం గమనించిన ఇండిగో విమాన సిబ్బంది.. వెంటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ రిక్వెస్ట్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన వెంటనే అనుమానాస్పద వ్యక్తిని సిఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇతని ఒంటిపై పూర్తిగా ఎర్రని మచ్చలు ఉండడంతో ఇతని డ్రగ్స్ తీసుకున్నాడా ? లేక ఇంకేదైనా వైరస్ సోకిందా? అనే కోణంలో పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఇతన్నికంట్రోల్ చేయడం కష్టంగా మారడంతో పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.