Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

హాట్ చిప్స్ తింటే అంతే సంగతులు..!

, హాట్ చిప్స్ తింటే అంతే సంగతులు..!

ఇటీవల చాలామంది పిల్లలు హాట్ చిప్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా స్నాక్స్ గా పెట్టడానికి పెద్ద పెద్ద హాట్ చిప్స్ సంచులను కొని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. కానీ ఆ హాట్ చిప్స్ వల్ల పిల్లల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని గ్రహించలేకపోతున్నారు.

హాట్ చిప్స్ తింటూ.. కోక్ తాగితే.. మజాగానే ఉంటుంది.. కానీ అదేపనిగా రోజు తింటే మీరు హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం. అవునండీ.  ఇది నిజం.! తమిళనాడులోని నెహ్రు చిల్డ్రన్స్ హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చిన చాలామంది చిన్నారులు హాట్ చిప్స్ బాధితులేనట. ఆ చిన్నారులకు జరిపిన ‘టెస్ట్’ రిపోర్ట్స్ లో.. కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

, హాట్ చిప్స్ తింటే అంతే సంగతులు..!

ఆ ఆసుపత్రికి వచ్చిన చిన్నారుల్లో కనీసం సగం మంది హాట్ చిప్స్ వల్ల సమస్యలు ఎదురుకున్న వారేనట. కడుపు నొప్పి, రక్తపు వాంతులు, మలం, మూత్రం నుంచి రక్తం రావడం వంటి సమస్యలతో వస్తున్నారట. అయితే వారు వాంతు చేసుకునేది రక్తం కాదని.. హాట్ చిప్స్ లో వేసే ఎర్ర రంగని వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు ఆ బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు.. వారు ఏమి తింటున్నారో కూడా తెలియదట.

మరోవైపు ఇది పిల్లలకు మాత్రమే కాదు అటు పెద్దవాళ్ళకు కూడా ఈ సమస్య వెంటాడుతోంది. ఎసిడిటీ రూపంలో వారికీ పెద్ద సమస్యే ఎదురవుతోంది. అయితే పిల్లలు చిన్నప్పటి నుండే ఈ ఆహారాన్ని తిన్నట్లు అయితే దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికే వీటిపై FDA కు ఫిర్యాదులు అందాయి. అయితే ఈ ఫిర్యాదులు తక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో హాట్ చిప్స్ అమ్మే సంస్థలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం హాట్ చిప్స్ వల్ల తమ పిల్లలకు సమస్య వచ్చినా.. FDA కు ఫిర్యాదు చేయాలనే ఆలోచన కలగడం లేదు వారి తల్లిదండ్రులకు.

 

Related Tags