15 క్యాన్ల బీరుతో అతడి ప్రాణం తిరిగొచ్చింది…డాక్టర్లు అలా ఎందుకు చేశారంటే..?

ముల్లును ముల్లుతోనే తీయాలి..వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఇవి మన పెద్దలు చెప్పిన మాటలు. చాలా విషయాల్లో ఈ తరహా సామెతలు..అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. తాజాగా జరిగిన  ఓ ఘటన వింటే మీరు ఆశ్యర్యపోవడం ఖాయం.  వియత్నాంలోని క్వాంగ్ త్రి ప్రాంతంలో నివశించే 48 ఏళ్ల గువెన్ వ్యాన్ నహాట్ అధిక మొత్తంలో మద్యం సేవించడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా..పలు పరీక్షలు చేసిన వైద్యులు..అతడు సాధారణ స్థాయి కంటే 1,119 రెట్లు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించినట్టు గుర్తించారు. […]

15 క్యాన్ల బీరుతో అతడి ప్రాణం తిరిగొచ్చింది...డాక్టర్లు అలా ఎందుకు చేశారంటే..?
Follow us

|

Updated on: Mar 09, 2020 | 7:09 AM

ముల్లును ముల్లుతోనే తీయాలి..వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఇవి మన పెద్దలు చెప్పిన మాటలు. చాలా విషయాల్లో ఈ తరహా సామెతలు..అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. తాజాగా జరిగిన  ఓ ఘటన వింటే మీరు ఆశ్యర్యపోవడం ఖాయం.  వియత్నాంలోని క్వాంగ్ త్రి ప్రాంతంలో నివశించే 48 ఏళ్ల గువెన్ వ్యాన్ నహాట్ అధిక మొత్తంలో మద్యం సేవించడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా..పలు పరీక్షలు చేసిన వైద్యులు..అతడు సాధారణ స్థాయి కంటే 1,119 రెట్లు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించినట్టు గుర్తించారు. దీని వల్ల అతడి శరీరంలో మిథనాల్ లెవల్స్ పెరగడంతో పాటు కాలేయ పనితీరు మందగించింది. అతని మరణం తప్పదని వైద్యులు దాదాపు ఫిక్స్ అయ్యారు. కానీ ఓ డాక్టర్‌కి తట్టిన ఆలోచన ఆ పేషెంట్ ప్రాణాలను నిలబెట్టేలా చేసింది.

ఆ ఐడియా ఏంటంటే..పేషెంట్‌కి బీర్లు పట్టించడం. అది కూడా ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 15 క్యాన్ల బీరును అతని కడుపులోకి పంపింగ్ చేశారు. అదేంటి బీరులో కూడా ఆల్కాహాల్ ఉంటుంది..అప్పుడు అతనే చనిపోయే అవకాశం మరింత ఉంటుంది కదా..? అనేగా  మీ డౌబ్ట్. ఇక్కడే సదరు వైద్యుడు తన బుర్రకు పనిపెట్టాడు. బీరులో ఆల్కాహాల్‌తో పాటు మన శరీరానికి మేలు చేసే రసాయనం కూడా మిళితమై ఉంటుందట. అందుకే సదరు పేషెంట్‌ కడుపులోకి గంటకు ఒకటి చొప్పున మొత్తం 15 క్యాన్ల బీరును పంప్ చేశారు. దీంతో శరీరం చికిత్సకు రెస్పాండ్ అయ్యింది. ఆల్కహాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం ఆల్కహాల్ ఇథనాల్, మరో రకం ఆల్కహాల్ మిథనాల్‌ను కలిగి ఉంటాయి. ఇథనాల్ ఆల్కహాల్ ఎక్కువగా బీర్, స్పిరిట్లలో ఉంటుంది. ఈ రెండింటీలో మిథనాల్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది పరిమితికి మించి తీసుకుంటే మనిషి అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత కేసులో పేషెంట్ మిథనాల్ ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకున్నాడు. అయితే సదరు వ్యక్తి శరీరంలో ఆక్సిడైజింగ్ జరిగి ఫార్మిక్ యాసిడ్‌‌‌గా మారేలోపే డాక్లర్లు బీరు ద్వారా ఇథనాల్ అందించారు. దీనివల్ల డాక్టర్లు డయాలసిస్ చేసేందుకు సమయం దొరికింది. ఇప్పడు అతడు వేగంగానే కోలుకుంటున్నాడు. సదరు పేషెంట్ కడుపులో డేంజరస్ యాసిడ్లను బ్యాలెన్స్ చేసేందుకేే డాక్టర్లు బీర్లు పంపింగ్ చేశారని తెలుసుకోవాలి. ఏదైనా ఓవర్ చేస్తే ఎంత డేంజరో ఇప్పటికైనా గుర్తుంచుకుంటే మంచిది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..