కడుపులో “టూత్ బ్రష్”.. స్కానింగ్ రిపోర్టు చూసి..

చైనాలో ఓ వింతైన ఘటన వెలుగుచూసింది. షెంజెన్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ నేరగాడు 20 ఏళ్ల క్రితం జైల్లో ఆత్మహత్యకు యత్నించి టూత్ బ్రష్‌ను మింగేశాడు. అయితే అప్పట్లో అతడికి ఎలాంటి హానీ జరగలేదు. అయితే కొద్ది రోజుల క్రితం అతడు తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. దీంతో సిటీస్కాన్ చేసిన వైద్యులు అతడి కడుపులో టూత్ బ్రష్ ఉన్నట్లు గుర్తించారు. ఆ బ్రష్ జీర్ణం కాకపోవడంతో ఇన్నేళ్లుగా కడుపులోనే ఉండిపోయింది. స్కానింగ్‌ తీసిన వైద్యులు […]

కడుపులో టూత్ బ్రష్.. స్కానింగ్ రిపోర్టు చూసి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2019 | 1:51 PM

చైనాలో ఓ వింతైన ఘటన వెలుగుచూసింది. షెంజెన్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ నేరగాడు 20 ఏళ్ల క్రితం జైల్లో ఆత్మహత్యకు యత్నించి టూత్ బ్రష్‌ను మింగేశాడు. అయితే అప్పట్లో అతడికి ఎలాంటి హానీ జరగలేదు. అయితే కొద్ది రోజుల క్రితం అతడు తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. దీంతో సిటీస్కాన్ చేసిన వైద్యులు అతడి కడుపులో టూత్ బ్రష్ ఉన్నట్లు గుర్తించారు. ఆ బ్రష్ జీర్ణం కాకపోవడంతో ఇన్నేళ్లుగా కడుపులోనే ఉండిపోయింది. స్కానింగ్‌ తీసిన వైద్యులు ముందుగా దానిని గుర్తించలేకపోయారు. ఏమైనా ఘన పదార్థం తిన్నావా అని అతడిని ప్రశ్నించగా.. 20 ఏళ్ల క్రితం జైలుల్లో ఉన్నప్పుడు టూత్ బ్రష్ తిన్నానని చెప్పాడు.