బంతాటాడుతూ డాక్టర్ల కేరింతలు..రోగులకు దిక్కేవరు ?

ప్రభుత్వాసుపత్రులు అంటే..పేద ప్రజల ప్రాణాలను కాపాడే ఆలయాలు అంటారు. అక్కడి వైద్యులు రోగుల పట్ల దేవుళ్లుగా భావిస్తారు. కానీ, పవిత్రమైన వైద్య వృత్తిని నిర్లక్ష్యం చేస్తూ..కొందరు డాక్టర్లు డ్యూటీ టైమ్‌లో హాయిగా ఆటపాటలతో ఎంజాయ్‌ చేశారు. వైద్య సేవలను గాలికి వదిలేసి..ఆస్పత్రి ప్రాంగణంలోనే ఆటలు మొదలు పెట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు అవస్థలు పడక తప్పలేదు. నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యాధికారులు […]

బంతాటాడుతూ డాక్టర్ల కేరింతలు..రోగులకు దిక్కేవరు ?
Follow us

|

Updated on: Dec 10, 2019 | 3:17 PM

ప్రభుత్వాసుపత్రులు అంటే..పేద ప్రజల ప్రాణాలను కాపాడే ఆలయాలు అంటారు. అక్కడి వైద్యులు రోగుల పట్ల దేవుళ్లుగా భావిస్తారు. కానీ, పవిత్రమైన వైద్య వృత్తిని నిర్లక్ష్యం చేస్తూ..కొందరు డాక్టర్లు డ్యూటీ టైమ్‌లో హాయిగా ఆటపాటలతో ఎంజాయ్‌ చేశారు. వైద్య సేవలను గాలికి వదిలేసి..ఆస్పత్రి ప్రాంగణంలోనే ఆటలు మొదలు పెట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు అవస్థలు పడక తప్పలేదు.
నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యాధికారులు సెలవుపై వెళ్లడంతో రోగులకు సేవలందించాల్సిన జూనియర్‌ డాక్టర్లు..బంతి ఆట ఆడుతూ కేరింతలు కొట్టారు. తమకు అడ్డు చెప్పే వారు లేరని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఖాళీ స్థలంలోనే ఏకంగా బంతాట ఆడారు.
ఉదయం 10 గంటల నుంచి విధులు నిర్వహించాల్సిన వారు.. రోగులను పట్టించుకోకుండా ఆటలాడారు. వారిని గమనించిన రోగుల బంధువులు కొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని వారు… సర్కారు దవాఖానకు వచ్చి ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటారు. అయితే, ఉన్నత చదువులు చదివి… పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన జూనియర్‌ డాక్టర్లు.. రోగుల గోడు పట్టించుకోకుండా ఆటలాడుతూ కాలక్షేపం చేయటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. పీహెచ్‌సీ వైద్యులు… సిబ్బందిపై రోగులు.. వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..