కరోనాపై పోరాడుతున్న.. వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రూ .50 లక్షల బీమా

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి

కరోనాపై పోరాడుతున్న.. వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రూ .50 లక్షల బీమా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 9:40 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ బీమా పథకం కింద రూ. 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం పొందవచ్చు. కరోనా వైరస్‌కు చికిత్స అందిస్తున్న సిబ్బందికి మార్చి 30 నుంచి 90 రోజుల కాలానికి ఈ బీమా పథకం వర్తిస్తుంది. కరోనా వైరస్ రోగులకు వీరు చికిత్స అందిస్తున్న సమయంలో వీరికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందువల్ల ఈ బీమా పథకం తీసుకురావడమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఇన్సూరెన్స్ వర్తించనుంది.