క‌డుపు‌లో 50 కిలోల కణితి : శస్త్రచికిత్స ద్వారా తొల‌గించిన వైద్యులు

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు అరుదైన ఆప‌రేష‌న్ చేశారు 57 ఏళ్ల మ‌హిళ క‌డుపు నుంచి ఏకంగా 50 కేజీల అండాశ‌య క‌ణితిని డాక్ట‌ర్లు విజ‌య‌వంతంగా తొలగించారు.

క‌డుపు‌లో 50 కిలోల కణితి : శస్త్రచికిత్స ద్వారా తొల‌గించిన వైద్యులు
Doctors
Follow us

|

Updated on: Aug 23, 2020 | 1:59 PM

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు అరుదైన ఆప‌రేష‌న్ చేశారు. 57 ఏళ్ల మ‌హిళ క‌డుపు నుంచి ఏకంగా 50 కేజీల అండాశ‌య క‌ణితిని డాక్ట‌ర్లు విజ‌య‌వంతంగా తొలగించారు. ఇందుకోసం వైద్యుల టీమ్ మూడున్నర గంటలపాటు శ్రమించింది. కాగా ఆమె శ‌రీరంలోని బ‌రువులో స‌గ భాగం క‌ణితే ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

గత కొద్ది నెలలు ఓ మహిళ అనూహ్యంగా బరువు పెరగ‌డం ప్రారంభమైంది. అలా, అలా పెరిగి ఏకంగా ఆమె 106 కిలోలకు చేరింది. దీంతో కొద్ది రోజులుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తాయి. అంతేకాదు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి పాటు నడిచినా, పడుకున్నా చాలా ఇబ్బందిగా ఉండేది. దీంతో ఆస్పత్రికి వ‌చ్చిన‌ ఆమెకు వివిధ టెస్టులు చేసిన డాక్ట‌ర్లు.. అండాశయంలో భారీ క‌ణితి ఉన్నట్లు గుర్తించారు. అది బరువు అధికంగా ఉండ‌టం, పేగులపై ఒత్తిడి ప‌డ‌టంతో… ఆహారం జీర్ణమవ్వకపోవడం, తీవ్రమైన కడుపు నొప్పి, హిమో గ్లోబిన్ శాతం పడిపోవడం లాంటి సమస్యలు వ‌చ్చినట్లు గుర్తించారు.

దీంతో రంగంలోకి దిగిన డాక్టర్ అరుణ్ ప్రసాద్ నేతృత్వంలోని డాక్ట‌ర్స్ టీమ్ ఆప‌రేష‌న్‌కి అన్ని సిద్దం చేసింది. అయితే లాప్రోస్కొపీ సాయంతో సర్జరీకి పరికరాలను పంప‌డానికి కూడా వీలు లేకుండా ఆమె పొత్తి కడుపు భాగాన్ని కణతి ఆక్రమించింది. దీంతో గైనకాలజీ, గ్యాస్ట్రో‌ఎంట్రాలజీ, అనస్థియాలజీ నిపుణులు శ్రమించి ఈ భారీ క‌ణితి బయటకు తీశారని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ట్రీట్మెంట్ అనంతరం ఆమెను ఆగస్టు 22న డిశార్జ్‌ చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో శ‌స్త్ర‌చికిత్స ద్వారా తొలిగించిన అతిపెద్ద‌ కణితి ఇదేనని, గ‌తంలో కొయంబత్తూరుకు చెందిన మహిళ కడుపు నుంచి 2017 లో 34 కేజీల కణితను తొలగించామని వైద్యులు తెలిపారు.

Also Read :

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు

మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం : భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య మృతి

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..