ఇది భార‌తీయుల స్పూర్తికి నిద‌ర్శ‌నంః మోదీ ట్వీట్

కొన్ని చోట్ల వైద్యుల‌పై కొంద‌రు దాడుల‌కు పాల్ప‌డుతుండ‌గా, మ‌రికొన్ని చోట్ల వారి సేవ‌ల‌కు పూల‌భిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఇది భార‌తీయుల స్పూర్తికి నిద‌ర్శ‌నంః మోదీ ట్వీట్
Follow us

|

Updated on: May 01, 2020 | 6:53 PM

క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌ను భ‌య‌కంపితుల‌ను చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ్యాప్తి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. భార‌త్‌లోని అన్ని రాష్ట్రాల‌పై కోవిడ్ పంజా విసురుతున్న వేళ‌..పోలీసులు, డాక్ట‌ర్లు, పారిశుద్ధ్య కార్మికుల సేవ‌లు వెల క‌ట్ట‌లేనివి. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు వారు ప‌డుతున్న శ్ర‌మ ఎన‌లేనిది. ఆ క్ర‌మంలో కొన్ని చోట్ల వైద్యుల‌పై కొంద‌రు దాడుల‌కు పాల్ప‌డుతుండ‌గా, మ‌రికొన్ని చోట్ల వారి సేవ‌ల‌కు పూల‌భిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఓ మ‌హిళా డాక్ట‌ర్ చేసిన సేవ‌ల‌కు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు ఎంత‌గానో స‌న్మానించారు. ఒక‌టి కాదు, రెండు కాదు..ఏకంగా 20 రోజుల పాటు ఇంటి ముఖం చూడ‌కుండా క‌రోనా పేషెంట్ల‌కు ఐసీయూలో వైద్య సేవ‌లు అందించినో లేడీ డాక్ట‌ర్ ఇంటికి వ‌చ్చిన వేళ ఆమెకు అపూర్వ స్వాగతం ల‌భించింది. ఆ వైద్యురాలు తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ వద్దకు రాగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగాలకు లోనై ఆనంద భాష్పాలు రాల్చడం వీడియోలో  చూడొచ్చు. అపార్ట్ మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ఆమెపై పూలవర్షం కురిపిస్తూ లోనికి ఆహ్వానించారు. చిన్నా..పెద్దా ప్లకార్డులతో ఆమె ధైర్యసాహసాలను కొనియాడుతూ.. ఆత్మీయతను చాటారు.

ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, ప్ర‌ధాని మోదీ దానిపై స్పందించారు. ఇలాంటివి చూస్తుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుందని  తెలిపారు. భారతదేశ స్ఫూర్తి అంటే ఇదేనని, మనం కొవిడ్-19తో ధైర్యంగా పోరాడుతున్నామని వివరించారు. అత్యంత ప్రమాదకర వైరస్ తో ముందు నిలిచి పోరాడుతున్న ఇలాంటి వారు ఎప్పటికీ గర్వించేలా చేస్తున్నారని కొనియాడారు.