సస్పెండ్ అయినా మారని తీరు.. నర్సుకు డాక్టర్ వేధింపులు

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. వారిపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇళ్లు, ఆఫీస్, బస్సు.. తేడా లేకుండా అన్ని ప్రదేశాల్లోనూ మహిళలను వేధిస్తున్నారు మృగాళ్లు. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురికి సేవ చేయాల్సిన డాక్టర్.. తన దగ్గర పనిచేసే స్టాఫ్ నర్సు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల […]

సస్పెండ్ అయినా మారని తీరు.. నర్సుకు డాక్టర్ వేధింపులు
Follow us

| Edited By:

Updated on: Feb 12, 2020 | 7:00 PM

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. వారిపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇళ్లు, ఆఫీస్, బస్సు.. తేడా లేకుండా అన్ని ప్రదేశాల్లోనూ మహిళలను వేధిస్తున్నారు మృగాళ్లు. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురికి సేవ చేయాల్సిన డాక్టర్.. తన దగ్గర పనిచేసే స్టాఫ్ నర్సు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లిన స్టాఫ్ నర్సుకు కాల్ చేసిన అతడు.. తనకు ఆమ్లేట్ కావాలని కోరాడు. దీనికి సరేనన్న నర్సు.. ఆసుపత్రి సిబ్బందిని పంపిస్తే, ఆమ్లేట్ వేసి పంపుతానని పేర్కొంది. అయితే నువ్వే తీసుకురావాలని అతడు కోరడంతో.. డాక్టర్ కదా అని ఆమ్లేట్ వేసుకొని ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆ తరువాత ఆమెను మేడపైన ఉన్న తన గదిలోకి రావాలన్న డాక్టర్.. తనతో పది నిమిషాల పాటు గడపాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు కుటుంబసభ్యులకు తెలిపింది. ఆసుపత్రికి చేరుకున్న వారు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

కాగా రవీంద్రపై గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి తప్పించారు. అయినప్పటికీ రవీంద్రలో ఎలాంటి మార్పు రాలేదు. పలుకుబడితో మరోసారి పోస్టింగ్ పొందిన అతడు.. తాజాగా మరోసారి తన వంకరబుద్ధిని చూపించాడు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు అతడిపై మరోసారి సీరియస్ అయ్యారు. రవీంద్రపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు అంటున్నారు.