నకిలీ కరోనా రిపోర్టులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన వైద్యుడు

కరోనా అంటే జనం బెంబెలేత్తుతున్నారు. కంటి కనిపించని మహమ్మారితో యుద్ధం చేస్తున్నారు. ఏ రూపంలో వస్తుందో తెలియక నానావస్థతలు పడుతుంటే.. జనం భయాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడో వైద్యుడు, అతడి సహాయకుడు. తమ వద్దకు కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి నకిలీ రిపోర్టులు ఇచ్చి మోసగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు కేటుగాళ్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ కరోనా రిపోర్టులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన వైద్యుడు
Follow us

|

Updated on: Sep 04, 2020 | 7:13 PM

కరోనా అంటే జనం బెంబెలేత్తుతున్నారు. కంటి కనిపించని మహమ్మారితో యుద్ధం చేస్తున్నారు. ఏ రూపంలో వస్తుందో తెలియక నానావస్థతలు పడుతుంటే.. జనం భయాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడో వైద్యుడు, అతడి సహాయకుడు. తమ వద్దకు కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి నకిలీ రిపోర్టులు ఇచ్చి మోసగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు కేటుగాళ్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలోని మాలవీయనగర్‌కు చెందిన వైద్యుడు కుష్‌ బిహారి పరాశర్‌ ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. అయితే, ఇద్దరు నర్సులను పనిలో కుదిర్చే ముందు వారికి కొవిడ్‌ పరీక్షల నిమిత్తం వైద్యుడిని సంప్రదించాడు ఓ హాస్పిటల్ యాజమాని. దీంతో వారి నుంచి శాంపిల్స్‌ సేకరించిన పరాశర్‌ ప్రఖ్యాత డయాగ్నిస్టిక్‌ సెంటర్‌ పేరుతో నకిలీ రిపోర్టును తయారుచేసి పంపాడు. అయితే, పొరపాటున ఓ నర్సు పేరులో తప్పు ఉండటంతో నేరుగా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి దాన్ని సరిచేసి కొత్త రిపోర్టు పంపాలని కోరారు. దీంతో తమ వద్ద రికార్డులను పరిశీలించిన ఆ డయాగ్నోస్టిక్స్‌ సిబ్బంది.. అలాంటి పేరుతో ఎవరూ తమ వద్ద టెస్ట్‌ చేయించుకోలేదని సమాధానం ఇచ్చారు.

అయితే, దీనిపై అనుమానం వచ్చిన సదరు యాజమాని హౌజ్‌ఖాస్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. డాక్టర్ కుష్‌ బిహారి పరాశర్‌, అతడి సహాయకుడు అమిత్‌ సింగ్‌లు ఇద్దరు కలిసి ఈ వ్యవహారం నడిపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు దక్షిణ దిల్లీ డీసీపీ అతుల్‌ కుమార్‌ ఠాకూర్‌ తెలిపారు.

తన వద్దకు వచ్చే రోగులను కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ఆ తర్వాత నకిలీ నివేదికలు తయారుచేసి పంపేవారని పోలీసులు తెలిపారు. ఒక్కో టెస్టుకు రూ.2400 చొప్పున వసూలు చేసేవాడినని నిందితుడు చెప్పినట్టు పేర్కొన్నారు. గత రెండు, రెండున్నర నెలలుగా ఈ ఫోర్జరీకి పాల్పడుతున్నాడనీ.. సీఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌, మోడ్రన్‌ డయాగ్నోస్టిక్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌, డాక్టర్‌ పి.భాసిన్‌ పాథ్‌లాబ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ప్రొగ్నోసిస్‌ లేబోరేటరీస్‌ల పేరుతో నకిలీ రిపోర్టులు తయారుచేసి ఇప్పటివరకు 75మందికి పైగా మోసగించాడని పోలీసులు తెలిపారు. కరోనా నెగటివ్‌, పాజిటివ్‌ అని చెప్పడానికి నిర్దిష్ట ప్రమాణమేమీ లేదనీ.. కేవలం తన వద్దకు వచ్చిన వ్యక్తులకు ఉన్న లక్షణాల ఆధారంగానే రిపోర్టులు తయారుచేసి ఇచ్చేవాడన్నారు. సేకరించిన శాంపిల్స్‌ను ధ్వంసం చేసేవాడన్నారు. ఈ వ్యవహారంతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..