బీపీ తక్కువైనా డేంజరే..

Low blood pressure, బీపీ తక్కువైనా డేంజరే..

ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒంట్లో శక్తి కోల్పోయినట్టవుతుందా? కూర్చుని ఒకేసారి లేచే సరికి కళ్లు తిరిగినట్టుగా అనిపిస్తోందా? ఏ చిన్న పనిచేసినా ఎంతో పనిచేసినట్టుగా అలసిపోయినట్టుగా ఫీలవుతున్నారా? ఇవన్నీ లో బీపీ లక్షాణాలే.చూడ్డానికి బాగానే కనిపించినా..చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది. దీన్ని ఎలా అధిగమించాలో చూద్దాం.

లో బీపీ..దీన్నే వైద్యపరిభాషలో హైపో టెన్షన్‌గా పిలుస్తారు. శరీరానికి అందాల్సిన రక్త సరఫరా శాతం ఉన్నట్టుండి ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఈ సమస్య వస్తుంది.
లో బీపీ సమస్యకు అనేక కార‌ణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రక్త హీనత. శరీరంలో రక్తం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటంతో రక్త హీనత ఏర్పడుతుంది. దీనివల్ల కూడా లో బీపీ సమస్య వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా లో బీపీకి ఒక ప్రధాన కారణమే. గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం లాంటివి ఉత్పన్నమవుతాయి. అలాగే హై బీపీ కోసం వేసుకునే మందులు కూడా లో బీపీకి కారణమవుతాయి. మ‌ద్యం, మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అతిగా సేవించ‌డం కూడా ఈ సమస్యకు కారణమేనంటున్నారు వైద్యులు. వీటన్నిటితో పాటు డీ హైడ్రేషన్ సమస్యతో కూడా లో బీపీ వస్తుంది.

గుండె నుంచి ర‌క్తం ఒక వేగంతో ప్ర‌వ‌హిస్తుంది. దీన్నే బ్ల‌డ్ ప్రెష‌ర్ అంటారు. దీన్ని బ‌ట్టే గుండె వేగం, శ్వాస‌, శ‌రీర ఉష్ణోగ్ర‌త ఆధార‌ప‌డి ఉంటుంది. బీపీని సిస్టోలిక్‌, డ‌యాస్టోలిక్ బీపీగా కొలుస్తారు. సిస్టోలిక్ బ్ల‌డ్ ప్రెష‌ర్ అంటే గరిష్ట సంఖ్య, గుండె కండ‌రాలు ర‌క్తాన్ని పంప్ చేస్తాయి. డ‌యాస్టోలిక్ ప్రెష‌ర్ అంటే క‌నిష్ట సంఖ్య‌. ఈ ద‌శ‌లో గుండె కండరాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి. గుండె ముడుచుకున్న‌ప్పుడు బీపీ ఎక్కువ‌గా ఉంటుంది. అదే రిలాక్స్ అవుతున్న‌ప్పుడు బీపీ త‌క్కువ‌గా ఉంటుంది. సిస్టోలిక్ బీపీ ఒక సాధార‌ణ ఆరోగ్య‌వంతుడైన వ్య‌క్తిలో 90 నుంచి 120 ఉండాలి. అదే డ‌యాస్టోలిక్ బీపీ 60- 80 మ‌ధ్య‌లో ఉంటే స‌రిపోతుంది.

హై బీపీ, లో బీపీ సమస్యల్లో.. లో బీపీ అత్యంత ప్రమాదకరమైందిగా చెబుతారు. దీన్ని అధిగమించడానికి మనసును రిలాక్స్‌‌గా ఉంచు  కోవడం, ప్రతిదానికి హైరానా  పడిపోకుండా సావధానంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మంచిది. బీపీని ఎప్పుడు సాధార‌ణ స్థాయిలో ఉండేలా చేసుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. లో బీపీ స‌మ‌స్య త‌ర‌చు ఎదుర్కోంటుంటే దాన్ని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం తప్పనిసరి. ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా సరే మనం తినే ఆహార పదార్ధాలతో చాల వరకు నియంత్రించవచ్చు.
శరీరానికి అవసరమైన పోషకాలు,ప్రోటీన్లతో పాటు రక్తాన్ని పెంచే ఆకు కూరలు, కూరగాయల్ని తీసుకుంటే మంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *