సమ్మెలపై ఉక్కుపాదం మోపితే..?.. గత చరిత్ర ఏం చెబుతోంది..?

ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు.. సమ్మె సైరన్ మోగిస్తున్నాం అని అంటే చాలు. ఈ వార్త విన్న మరుక్షణం ప్రభుత్వాలు ఉలిక్కిపడుతాయి. ఎందుకంటే ఈ పదానికి ఉన్న పవర్ అలాంటిది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులు.. వారి వారి న్యాయబద్దమైన డిమాండ్లను పొందేందుకు సమ్మెకు పిలుపునిస్తారు. అయితే వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనప్పుడు సమ్మెకు దిగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో సమ్మె జరగకుండా ప్రభుత్వాలు వారిని శాంతింపజేస్తే.. మరి కొన్ని సందర్భాల్లో అణచివేసే ఘటనలు కూడా […]

సమ్మెలపై ఉక్కుపాదం మోపితే..?.. గత చరిత్ర ఏం చెబుతోంది..?
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 12:12 PM

ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు.. సమ్మె సైరన్ మోగిస్తున్నాం అని అంటే చాలు. ఈ వార్త విన్న మరుక్షణం ప్రభుత్వాలు ఉలిక్కిపడుతాయి. ఎందుకంటే ఈ పదానికి ఉన్న పవర్ అలాంటిది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులు.. వారి వారి న్యాయబద్దమైన డిమాండ్లను పొందేందుకు సమ్మెకు పిలుపునిస్తారు. అయితే వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనప్పుడు సమ్మెకు దిగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో సమ్మె జరగకుండా ప్రభుత్వాలు వారిని శాంతింపజేస్తే.. మరి కొన్ని సందర్భాల్లో అణచివేసే ఘటనలు కూడా ఉంటాయి. అయితే ఈ సమ్మెలు చేసిన కాలంలో కార్మికుడు.. జీతం నష్టపోయి, అనుకున్నవి సాధించలేక ఓడిపోవచ్చు. కానీ అంతమాత్రాన ప్రభుత్వాలది గెలుపు కాదు.. కార్మికులది ఓటమి కాదు. అయితే ఈ సమ్మె ప్రభావం తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ ప్రభుత్వంపై తప్పకుండా పడుతుంది. ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో రిపీట్ అయ్యింది. అయితే మన భారత దేశ చరిత్రలో కూడా ఇలాంటి సమ్మె ఎఫెక్ట్‌లతో ప్రభుత్వాలు కుప్పకూలాయి.

అందులో ముఖ్యంగా 1974లో జరిగిన రైల్వే సమ్మె.. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద సమ్మెగా చెబుతారు. అప్పట్లో జార్జి ఫెర్నాండెజ్​ నాయకత్వంలో 17 లక్షలమంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు దిగారు. దాదాపు ఇరవై రోజులపాటు కొనసాగిన సమ్మె​ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేసింది. దీని ప్రభావం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సమ్మె ముగిసిన ముడేళ్ల1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వం కుప్పకూలింది.

ఇక మరో సమ్మె ఎఫెక్ట్‌ను మర్రిచెన్నారెడ్డి చవిచూశారు. 1978లో మర్రి చెన్నారెడ్డి మొదటిసారి సీఎం అయ్యారు. అయితే సీఎం పీఠం అధిష్టించిన కొద్ది రోజులకే వైద్యులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అసిస్టెంట్​ సివిల్​సర్జన్లు, జూనియర్​ డాక్టర్లు నిరసన బాట పట్టారు. వారి డిమాండ్లను పట్టించుకోకుండా.. మర్రి చెన్నారెడ్డి సమ్మెను అణచివేశారు.దాని పర్యవసానమే.. ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన(1980) ఎన్నికల్లో ఆయన సీఎం కుర్చీ వదులుకోవలసి వచ్చింది.

అంతేకాదు ఎన్టీఆర్ కూడా సమ్మె రుచిని చవిచూశారు. 1985 ఎన్నికల్లో రెండోసారి సీఎం అయ్యారు. సంవత్సరం గడిచిన తర్వాత 1986 నవంబర్​లో ఉద్యోగ, ఉపాధ్యాయ​, కార్మిక పోరాట సమితి సమ్మెకు పిలుపునిచ్చింది. ఏకంగా 53 రోజుల పాటు రాష్ట్రం స్తంభించింది. అయితే చివరకు ఉద్యోగులే తలవంచారు. కానీ ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎన్టీఆర్ చూడాల్సి వచ్చింది.

ఇక 2002లో తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఉద్యోగులు, టీచర్లపై మొండిగా వ్యవహరించారు. దీంతో 2003లో దాదాపు 10 లక్షలకు పైగా సిబ్బంది సమ్మెకు దిగారు. అయితే సమ్మెకు దిగిన వారిపై  జయ ప్రభుత్వం ఎస్మా ఆర్డినెన్స్​ ప్రయోగించి.. లక్షా 76 వేల మందిని డిస్మిస్ చేశారు. ఆ తర్వాత సుప్రీం చొరవతో వాళ్లను మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత జరిగిన 2006 ఎన్నికల్లో జయలలిత ఓటమిని చవిచూశారు.

అయితే తాజాగా తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. దీంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్వవస్థ ఇబ్బందుల్లో పడింది. అయితే అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపేది లేదంటూ తెగేసి చెప్పింది. అంతేకాదు.. గడువులోగా విధుల్లోకి చేరని వారు సెల్ఫ్ డిస్మిస్‌ అయినట్లే నని ప్రకటించింది. అయితే ప్రభుత్వం సమ్మెలో పాల్గొన్న వారిని తొలగిస్తున్నట్లు పరోక్షంగా తేల్చి చెప్పింది. వారి ఉద్యోగాలను వారే వదులుకున్నారని.. వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు సిద్ధమైనట్లు తెలపింది. అయితే గత చరిత్రను బట్టి చూస్తే.. కార్మికులు చేపట్టిన సమ్మెతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేది. కానీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న సమ్మె తీరు చరిత్రకు విరుద్ధంగా కనిపిస్తున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం.. దసరా పండుగ సందర్భంగా సమ్మెకు దిగడంతో.. ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే విపక్షాలు మాత్రం సమ్మెకు మద్దతు తెల్పుతున్నా.. సహచర కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి మద్దతు ప్రకటించడం లేదు. ఇదే అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతోంది. ప్రభుత్వ తీరును కొందరు ప్రజలు కూడా సమర్థిస్తుండటంతో.. సమ్మె ప్రభావం అధికార టీఆర్ఎస్‌పై ఎక్కువగా పడటం లేదు. అయితే రాబోయే 2023 ఎన్నికల వరకు ఈ సమస్య పూర్తిగా సమసిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చరిత్రలో జరిగిన ఘటనలు తెలంగాణలో పునరావృతం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..