Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

టీంకు ఎలాంటి ఇబ్బంది లేదు.. గువాహటి సేఫ్టీ సిటీ..!

Do not know enough about citizenship law': Virat Kohli on CAA ahead of Guwahati T20I, టీంకు ఎలాంటి ఇబ్బంది లేదు.. గువాహటి సేఫ్టీ సిటీ..!

శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. ఆదివారం అసోం రాజధాని గువాహటి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవన్న వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మీడియా ప్రశ్నించింది. దీంతో కోహ్లీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఏఏ నిరసనల నేపథ్యంలో జట్టుకు..ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని పేర్కొన్నాడు. భద్రతా పరంగా అంత ముప్పేమి ఉండదని.. గువాహటిని సేఫ్టీసిటీగా భావిస్తున్నామన్నాడు.

ఇక దేశ వ్యాప్తంగా చెలరేగుతున్న ఈ ఆందోళనలపై తాను బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించదలుచుకోలేదన్నాడు. ఇరు వైపులా అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుందని.. ఈ అంశంపై నాకు పూర్తి సమాచారం తెలీదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్డిగా నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదని పేర్కొన్నాడు.

కాగా, అసోంలో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకు మూడు వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. నిరసనల నేపథ్యంలో హింసకు పాల్పడ్డ మరో 190 మందిని అరెస్ట్ చేశారు. ఇక మ్యాచ్ జరుగనున్న గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో.. అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ భద్రతను కట్టుదిట్టం చేసింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు కేవలం మొబైల్‌ ఫోన్లు, పర్సులు మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

Related Tags