రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తమిళ రాజకీయ వేత్త.. ఈ విషయం గురించి ఇప్పటికే కోర్టుకు వెళ్లామని..

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రైతుల ఆందోళనకు

రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తమిళ రాజకీయ వేత్త.. ఈ విషయం గురించి ఇప్పటికే కోర్టుకు వెళ్లామని..
Follow us

|

Updated on: Dec 05, 2020 | 8:45 PM

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రైతుల ఆందోళనకు డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండ సార్లు రైతులతో చర్చలు నిర్వహించగా విఫలమయ్యాయి. తాజాగా మూడోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ రైతుల గురించి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఇప్పటికే మేం కోర్టుకు వెళ్లామని తెలిపారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకుంటారని కానీ ఇప్పటి వరకు రైతుల గురించి ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని ఆరోపించారు. ప్రధాని నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడైతే ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ఏర్పరిచి వారికి సరైన న్యాయం చేసేవారని ఎద్దేవా చేశారు. డీఎంకే రైతుల ఆందోళనకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అన్నం పెట్టే రైతన్నకు కనీస మద్దతు ధర కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా రైతులు ధర్నాచేస్తుంటే పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు