Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం. విశాఖ సాల్వెంట్స్ లో పేలిన ట్యాంకులు. భారీగా ఎగసిపడుతున్మ మంటలు.. దట్టంగా అలుముకున్న పొగ. ప్రమాదంలో పలువురు చిక్కుకున్నట్టు అనుమానం. రంగంలోకి ఫైర్ సిబ్బంది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్‌కు టోకరా విషయంలో గతఇన్‌చార్జ్ తహసీల్దార్‌ నిర్మలాకిృష్ణను సస్పెండ్‌చేసిన కలెక్టర్‌ శ్యామ్యూల్‌ఆనంద్‍. గుంటూరు సెంట్రల్‌బ్యాంక్‌లో తీసుకున్నలోన్‌ఎమౌంట్‌కట్టిన రైతులు. ఒకకోటి తొమ్మిదిలక్షల డెభ్బైవేల బ్యాంక్‌కు జమచేసిన రైతులు.
  • ప్రకాశంజిల్లా కలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు... లాక్‌డౌన్‌ సడలింపులు చేయాలంటూ కలెక్టర్‌తో సమావేశమైన వ్యాపారస్తులతో ఛలోక్తులు విసిరిన కలెక్టర్‌ ... నాకంటే బాగా పనిచేస్తున్నారని ఎవరైనా భావస్తే ఒకరోజు కలెక్టర్‌గా పనిచేసేందుకు అవకాశమిస్తా... పనిచేసి చూపించడండి.. కలెక్టర్‌ పోలా భాస్కర్.
  • కడపజిల్లా: ప్రొద్దుటూరు వై.సి.పి.లో రెండు వర్గాలు మధ్య ఘర్షణ. మహమ్మద్ గౌస్ అనే కౌన్సిలర్ అభ్యర్థి పై బీరు బాటిళ్లు,ఇనుపరాడ్లతో అదే పార్టీకి చెందిన చెందిన మైనార్టీ నాయకుల దాడి. తీవ్ర గాయాలు ..ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.పరిస్థితి విషమం. స్థానిక సంస్థల ఎన్నికల నాటి విభేదాలతో దాడి.
  • సైఫాబాద్ పి ఎస్ పరిధిలోని ఓ బ్యాంకు సమీపంలో ఫుట్ పాత్ పై తన కూతురుతో నిద్రపోయినా బేగం అనే మహిళ. ఇదే అదునుగా భావించిన నలుగురు నిందితులు రెండు సంవత్సరాల చిన్నారి మహీన్ కిడ్నాప్ చేసి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు షరీఫ్ మొహమ్మద్ ఫీర్దొస్ లను అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా కాపాడి తల్లి బేగం కు చిన్నారినీ అప్పగించారు.
  • వికారాబాద్ పట్టణంలో కరోనా వైరస్ పాసిటివ్ కేసులు ఎక్కువడంతో అన్నిరకాల వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు కరోనా వైరస్ వ్యాప్తినియంత్రించేందుకు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు 10 రోజుల పాటు పట్టణము లోని అన్ని షాపులను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.
  • విశాఖ: క్రైమ్ డీసిపీ సురేష్ బాబు కామెంట్స్ . పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించాము. ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. విచారణ అనంతరం వాస్తవాలు బయటికి వస్తాయి.

డీఎంకే నేత అంబజగన్‌కు ఆరోగ్య పరిస్థితి విషమం..

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ టచ్ చేస్తోంది. తాజాగా ఈ మహమ్మారి రాజకీయ నేతలను, పోలీసులకు, జర్నలిస్టులను.. చివరకు వైద్యులను కూడా వదలడం లేదు.
DMK MLA J Anbazhagan on ventilator support after testing Corona positive, డీఎంకే నేత అంబజగన్‌కు ఆరోగ్య పరిస్థితి విషమం..

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ టచ్ చేస్తోంది. తాజాగా ఈ మహమ్మారి రాజకీయ నేతలను, పోలీసులకు, జర్నలిస్టులను.. చివరకు వైద్యులను కూడా వదలడం లేదు. తాజాగా తమిళనాడులో డీఎంకే సీనియర్ నేత కూడా కరోనాతో పోరాడుతున్నారు. చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఆయన సహాయ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఆయన కరోనా సోకి చెన్నైలోని క్రోమ్‌పేటలో  ఉన్న డాక్టర్ రీలా ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు తెల్పిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. ఆయన తనకు అవసరమైన ఆక్సిజన్‌లో 80 శాతం వెంటిలేటర్ ద్వారానే తీసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి
మార్పు లేదని.. వెంటిలేటర్ మీది నుంచే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.

Related Tags